వీఐపీ రోడ్డులో తనిష్క్‌ స్టోర్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

వీఐపీ రోడ్డులో తనిష్క్‌ స్టోర్‌ ప్రారంభం

Published Sat, Dec 2 2023 1:08 AM

తనిష్క్‌ స్టోర్‌ను ప్రారంభిస్తున్న 
వైస్‌ ప్రెసెడెంట్‌ అరుణ్‌ నారాయణ్‌  - Sakshi

మద్దిలపాలెం: టాటా సంస్థకు చెందిన రాష్ట్రంలోనే అతిపెద్ద స్టోర్‌ తనిష్క్‌ నగరంలోని వీఐపీ రోడ్డులో శుక్రవారం ప్రారంభమైంది. ఈ స్టోర్‌ను బిజినెస్‌ అసోసియేట్‌ ఉప్పలపాటి రాజా సమక్షంలో తనిష్క్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌ నారాయణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ తనిష్క్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేదీ వరకు ప్రతీ కొనుగోలుపై ఉచితంగా బంగారు నాణేలు అందిస్తున్నట్లు చెప్పారు. 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్టోర్‌లో బంగారం, వజ్రాలు రెండింటిలోనూ సుమారు 5వేల పైగా డిజైన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అరుణ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ విశాఖలో అతిపెద్ద స్టోర్‌ను ప్రారంభించామన్నారు. నాణ్యమైన వ్యక్తిగత కలెక్షన్లను అందుబాటులో ఉంచామని, ఆహ్లాదకరమైన షాపింగ్‌ అనుభూతిని కలింగేలా స్టోర్‌ను తీర్చిదిద్దామన్నారు. స్టోర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా విదేశీ యువతులతో ఏర్పాటు చేసిన మ్యూజిక్‌ ఈవెంట్‌ అందరినీ ఆకట్టుకుంది. తనిష్క్‌ ఆభరణాలతో స్థానిక మహిళలు చేసిన ఫ్యాషన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనిష్క్‌ రీజినల్‌ మేనేజర్‌ శ్రీకృష్ణా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement