బ్లాక్‌ కరెన్సీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ కరెన్సీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్‌

Published Sun, Mar 24 2024 12:55 AM

-

గోపాలపట్నం: బ్లాక్‌ కరెన్సీ కేసులో ప్రధాన నిందితుడు షేక్‌ అబ్దుల్‌ గని అలియాస్‌ గనిరాజును ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్ట్‌ చేసి, శనివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గత నెల 20న కాకానినగర్‌లోని ఓ ట్రావెల్స్‌ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న బ్లాక్‌ కరెన్సీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. విశాఖకు చెందిన కోసుంపూరి వెంకట కనకదుర్గరాజు అలియాస్‌ భాస్కరరావు, పశ్చిమ గోదావరి జిల్లా యండగండికి చెందిన మద్దాల శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3 కోట్ల విలువైన మూడు బ్యాగుల్లో బ్లాక్‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా.. దీనికి సూత్రధారి గనిరాజు అని వారు వెల్లడించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. శుక్రవారం కాకానినగర్‌ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కారులో ఉన్న గనిరాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నల్లటి రంగు పూసిన కాగితాలను రసాయనంలో ముంచితే అసలు కరెన్సీగా మారుతుందని నమ్మించి మోసానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు. అతనిది కాకినాడ దగ్గరలోని పెనుమర్తి ప్రాంతం. పదేళ్ల కిందట నిందితుడిపై దొంగ నోట్ల మార్పిడి కేసు నమోదైంది. అతని నుంచి కారు, 10 మొబైల్‌ ఫోన్లు, బంగారు చైన్‌, వాచ్‌ స్వాధీనం చేసుకున్నారు. శనివారం అతన్ని రిమాండ్‌కు తరలించారు.

రిమాండ్‌కు తరలించిన ఎయిర్‌పోర్టు పోలీసులు

కారు, 10 ఫోన్లు స్వాధీనం

Advertisement
Advertisement