–IIలో | Sakshi
Sakshi News home page

–IIలో

Published Sat, Mar 11 2023 10:20 AM

- - Sakshi

శనివారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2023

కలెక్టర్‌ కార్యాలయంలో

రిసెప్షన్‌ సెంటర్‌

పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులు తరలించి భద్రపరిచేందుకు

కలెక్టర్‌ కార్యాలయంలో రిసెప్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు చేరిన తర్వాత వాటిని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచి ఇక్కడి నుంచి విశాఖకు తరలించే ఏర్పాట్లు చేస్తాం. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటువేసే

వాతావరణం కల్పిస్తున్నాం.

– ఎ.సూర్యకుమారి,

విజయనగరం జిల్లా కలెక్టర్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్‌ సజావుగా జరిగేలా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఓటర్లందరికీ బీఎల్‌ఓల ద్వారా ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేశారు. రెండు జిల్లాల ఎన్నికల యంత్రాంగం అందజేసిన ఓటరు స్లిప్పుల ఆధారంగా ఓటరు జాబితాలో ఓటర్ల పేరు గుర్తించేందుకు అవకాశం ఉంది. పోలింగ్‌ కేంద్రం సమీపంలో కూడా ఓటరు స్లిప్పులు

అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఇలా...

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 77,022 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విజయనగరం జిల్లాలో 58,502 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 18,502 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం విజయనగరం జిల్లా యంత్రాంగం 72, పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం 24 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో మొత్తం ఓటర్లలో 38,625 మంది పురుషులు, 19,868 మంది మహిళా ఓటర్లు, 9 మంది థర్డ్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. విజయనగరం డివిజన్‌లో అత్యధికంగా 33,643 ఓటర్లు ఉండగా చీపురుపల్లి డివిజన్‌లో 14,256 మంది, బొబ్బిలి డివిజన్‌లో 10,603 మంది ఓటర్లు ఉన్నారు.

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం 96 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం డివిజన్‌లో 42, బొబ్బిలి డివిజన్‌లో 13, చీపురుపల్లి డివిజన్‌లో 17, పార్వతీపురం మన్యం జిల్లాలో 24 చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క విజయనగరం పట్టణంలోనే 20 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.

ఎన్నికల సామగ్రి పంపిణీ

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం అవసరమైన సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు, ఎన్నికల సిబ్బంది కేటాయింపు, తదితర పనులకు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయనగరం డివిజన్‌కు ఆర్డీఓ కార్యాలయంలోనూ చీపురుపల్లికి సంబంధించి ఎస్‌డీఎస్‌ కళాశాల గరివిడిలోనూ, బొబ్బిలి తహసీల్దార్‌ కార్యాలయంలోనూ ఎన్నికల సామగ్రి ఏర్పాట్లు చేశారు. మార్చి 12న ఉదయం 8 గంటల నుంచే సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు.

జోనల్‌, రూట్‌ అధికారుల నియామకం

విజయనగరం జిల్లాను 13 జోన్లుగా విభజించి 13 నుంచి జోనల్‌ అధికారులను నియమించారు. దీంతోపాటు 13 రూట్లుగా విభిజించి 24 మంది రూట్‌ అధికారులను నియమించారు.

మైక్రో అబ్జర్వర్ల నియామకం

ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగేలా తగిన పర్యవేక్షణ చేసే నిమిత్తం ఎన్నికల సంఘం 96 మంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లగా నియమించింది. వీరికి అదనంగా 20 మంది రిజర్వు అబ్జర్వర్లను కూడా నియమించింది. పోలింగ్‌ తీరును గమనించి దీనిపై ఎన్నికల సంఘానికి వీరు నివేదికలు అందజేస్తారు. వీరికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తి చేశారు.

కలెక్టర్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌

పోలింగ్‌ రోజున ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు జిల్లా పరిషత్‌ సీఈఓ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి రెండు గంటలకు నమోదైన ఓట్లను తెలుసుకోవడంతోపాటు ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతున్న విధానం, ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యిందీ లేనిదీ వంటి సమస్యలు కూడా తెలుసుకుంటారు. జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే ఎన్నికల పర్యవేక్షణ చేస్తారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన 96 పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటర్లకు అవసరమైన కనీస వసతులు కల్పించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తాగునీటి సదుపాయాలు, ప్రాథమిక వైద్య చికిత్స, ఓటర్లు నిల్చునేందుకు తగిన నీడ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక సంఖ్యలో ఓటర్లు ఉండే కేంద్రాల్లో బారికేడ్లు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సరళిని వర్చువల్‌గా పరిశీలించేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. 96 కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలింగ్‌ జరుగుతున్న తీరును జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్‌ తదితరులు

పర్యవేక్షిస్తారు.

న్యూస్‌రీల్‌

ఉమ్మడి విజయనగరం జిల్లాలో

96 పోలింగ్‌ కేంద్రాలు

ఓటు హక్కు వినియోగించుకోనున్న గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 77,022 మంది

13న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్‌

బ్యాలెట్‌ బాక్సులు, పేపర్లు సిద్ధం

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం విజయనగరం జిల్లాకు 229 పెద్ద సైజు బ్యాలెట్‌లను ఎన్నికల సంఘం సరఫరా చేసింది. వీటికి అదనంగా మరో 100 రిజర్వు బ్యాలెట్‌ బాక్సు లు కూడా సమకూర్చింది. ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను ఇప్పటికే జిల్లా కేంద్రానికి అధికారులు చేర్చారు. బ్యాలెట్‌ పత్రాల తనిఖీ కూడా జిల్లా స్థాయిలో పూర్తిచేసి స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రంగా ఉంచారు.

1/2

సావిత్రిబాయి పూలే విగ్రహానికి 
నివాళులర్పిస్తున్న నాయకులు
2/2

సావిత్రిబాయి పూలే విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

Advertisement
Advertisement