జగనే కావాలి | Sakshi
Sakshi News home page

జగనే కావాలి

Published Fri, Nov 10 2023 4:46 AM

- - Sakshi

–2లో
సంక్షేమ, అభివృద్ధి పాలన సాగాలంటే...

అధికారిక ‘దత్తత’ సేఫ్‌

ప్రభుత్వ ఆమోదంతో పిల్లలను దత్తత తీసుకోవడం మంచిదని శిశుసంక్షేమ అధికారులు చెబుతున్నారు.

అన్ని మండలాల్లో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

లబ్ధిదారులకు జరిగిన మేలు,

అభివృద్ధిపై ప్రదర్శన

జరుగుతున్న మంచిని ఆధారాల

సహా వివరణ

మంచి చేస్తున్నాం.. మద్దతుగా ఉండాలని కోరిన ప్రజాప్రతినిధులు

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

సంక్షేమం: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఒక సచివాలయం పరిధిలో ఎంతమందికి మేలు జరిగింది?

విద్య: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన మార్పులేమిటి? ఇంగ్లిష్‌ మీడియం, ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌, ట్యాబ్‌ల వంటి అదనపు హంగులతో విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులేమిటి?

వైద్యం: విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో ప్రజల ప్రాణాలకు ఎలాంటి భరోసా కలుగుతోంది?

వ్యవసాయం: రైతుభరోసా కేంద్రం ఏర్పాటుతో అందుబాటులోకి విత్తనాలు, ఎరువులు, ప్రతి ఎకరాలోని పంటల ఈ–క్రాప్‌, అర్హత ఉన్న ప్రతి రైతుకూ ఏటా పెట్టుబడి సాయం, ఒకవేళ ప్రకృతి విపత్తులతో నష్టపోతే పరిహారం, సున్నావడ్డీ రుణాలు ఎలా అందుతున్నాయి?

పౌరసేవలు: సచివాలయం ద్వారా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్లు, పరిపాలనలో విప్లవాత్మక మార్పులు ఎలా సాధ్యమయ్యాయి?

శాశ్వత అభివృద్ధి: గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌కు పక్కా భవనాలతో పాటు గడపగడపకూ మన ప్రభుత్వం (జీజీఎంపీ) ద్వారా గుర్తించి ప్రాధాన్యత కార్యక్రమాలకు చేసిన ఖర్చుతో శాశ్వత అభివృద్ధి పనులు ఏవిధంగా పూర్తయ్యాయో?

ఇలా ఒకటేమిటి ప్రజలకు చేసిన మంచి ఏమిటో ప్రతిదీ ఆధారాలతో చూపించడానికి తలపెట్టిన కార్యక్రమమే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’. ఒక సచివాలయం యూనిట్‌గానే ఇంత మంచి చేసిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంత అవసరమో ఘంటాపథంగా చెప్పడమే దీని ఉద్దేశం. జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు గురువారం ప్రారంభించారు. ప్రతి ఇంటికి ఎంత మేలు జరిగిందో, సంక్షేమ పథకాలతో గ్రామాల వారీగా ఎంతమేర ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), నాన్‌ డీబీటీ ద్వారా ఎంతమందికి, ఎంత మేర మేలు జరిగిందో వివరించారు. అందుకు సంబంధించి ఆధారాలతో సహా ఫ్లెక్సీలో ప్రదర్శించారు.

మంచిచేసే నాయకుడు

ప్రజలకు నిరంతరం మంచిచేయాలని పరితపించే నాయకుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అని డిప్యూటీస్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు.

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఒకటో డివిజన్‌ పూల్‌బాగ్‌ కాలనీలో నిర్వహించిన ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డివిజన్‌ పరిధిలోని ప్రజలకు డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల రూపంలో అందించిన రూ.11.35 కోట్ల వివరాలతో పాటు పరోక్షంగా చేసిన రూ.9.4 కోట్ల మేర లబ్ధిని వివరిస్తూ ఏర్పాటు చేసిన డాష్‌ బోర్డును ప్రారంభించారు. పూల్‌బాగ్‌ కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ జెండాను ఎగరవేశారు.

● నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌ బాబు ప్రారంభించారు. తర్వాత మొయిదా జంక్షన్‌ నగర పంచాయతీ, పూసపాటిరేగ–1 సచివాలయం, డెంకాడ, భోగాపురంలో జరిగిన కార్యక్ర మాలకు హాజరయ్యారు. నాలుగున్నరేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పాలన, జిల్లాలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు.

● ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంలో భాగంగా ఎస్‌.కోటలోని సచివాలయం–1లో డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డును ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం కొత్తవలస సచివాలయం–1లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎస్‌.కోట బర్మా కాలనీలో, కొత్తవలసలో ఆయా మండల పార్టీ నేతలు పల్లెనిద్రకు ఉపక్రమించారు.

సంక్షేమ పాలనలో దేశానికే ఆదర్శం

చీపురుపల్లి: దేశంలో మరెక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలవుతున్నాయని, భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరగాలంటే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డినే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. మెరకముడిదాం మండల కేంద్రంలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ఆయన ప్రా రంభించారు. సంక్షేమ పఽథకాల డ్యాష్‌ బోర్డును, వైస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలోని సచివాలయం–1 వద్ద వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ప్రారంభించారు.

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయమని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలిలోని సంఘం వీధిలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ పాలనను వివరించారు.

రాజాం మున్సిపాల్టీ సత్యనారాయణపురం వార్డు సచివాలయం వద్ద ఎమ్మెల్యే కంబాల జోగులు సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అనంతరం రాజాం మండలం కంచరాం, సంతకవిటి మండలం సంతకవిటిలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజాం పట్టణ పరిధి ఈశ్వరనారాయణకాలనీలో సహపంక్తి భోజనాలు చేసి రాత్రి బస చేశారు. రేగిడి మండలం రేగిడి గ్రామంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి రాత్రి బస చేశారు.

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement

తప్పక చదవండి

Advertisement