సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు పార్వతీపురం విద్యార్థులు | Sakshi
Sakshi News home page

సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు పార్వతీపురం విద్యార్థులు

Published Sun, Nov 12 2023 12:28 AM

ఎంపికై న విద్యార్థులను మెమొంటోలతో 
అభినందిస్తున్న డీఈవో ప్రేమ్‌కుమార్‌ 
 - Sakshi

చికెన్‌

పార్వతీపురంటౌన్‌: రాష్ట్ర స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు పార్వతీపురం విద్యార్థులు ఎంపికయ్యారని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన ఎంపికై న విద్యార్థులను అభినందించి, కాసేపు మాట్లాడారు. అక్టోబరులో జరిగిన 31వ జిల్లా బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల్లో పార్వతీపురం పట్టణంలోని జిల్లా పరిషత్‌ సంస్కృత పాఠశాల విద్యార్థులు అంకం ఝాన్సీ, కుండలీశ్వరి కీర్తిప్రియ, ఆనుపోజు తన్మయి సేవ్‌ ఎలిఫెంట్‌ అండ్‌ ఎకోసిస్టం విత్‌ ప్లాన్‌ బివేర్‌ ఈస్‌ మై ఎలిఫెంట్‌ ప్రాజెక్టులు రూపొందించి, ప్రదర్శించడంలో విశేష ప్రతిభ కనబరచడంతో ప్రథమ స్థానం దక్కించుకున్నారన్నారు. ఆండ్రాయిడ్‌ యాప్‌ను క్రియేట్‌ చేసి, జీపీఎస్‌ టెక్నాలజీ, సెన్సార్స్‌, ఆటోమేటిక్‌ ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ సిస్టమ్స్‌ ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలో తరచుగా సంభవిస్తున్న ఏనుగుల మరణాలను నిరోధించవచ్చని, ఏనుగులను సంరక్షించుకోవచ్చని, భవిష్యత్తులో ఏనుగులు అంతరించిపోకుండా ఉంచవచ్చని, ప్రమాదాల నుంచి ఏనుగులను రక్షించవచ్చని, గజరాజుల దాడిలో ప్రజలెవరూ మరణించకుండా ఉండొచ్చని, పంట పొలాలను కాపాడవచ్చని నిరూపించే ఓ వినూత్న ప్రాజెక్టును వీరు తయారు చేయడం అభినందనీయమన్నారు. ఈ నెలాఖరులో గుంటూరు కేఎల్‌ వర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు హాజరవుతారన్నారు. అక్క డ కూడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు వెళ్లాలని, డీఈవో, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌ లెస్‌

శ్రీ102 శ్రీ174 శ్రీ184

Advertisement
Advertisement