చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

Published Sun, Nov 12 2023 12:28 AM

చోరీ వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ సీఐ 
తిరుపతిరావు(వెనుక ముసుగులో నిందితుడు) - Sakshi

విజయనగరం క్రైమ్‌: చోరీ కేసులో నిందితుడిని రూరల్‌ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని, అరెస్ట్‌ చేశారు. రూరల్‌ సీఐ టి.వి.తిరుపతిరావు వివరాలిలా ఉన్నాయి.. ద్వారపూడి వినాయకనగర్‌లో నివాసముంటున్న హిమమణి, ఆమె భర్త సూర్యప్రకాష్‌ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన ఎప్పటిలాగే విధుల నిమిత్తం పాఠశాలకు వారు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో హిమమణి ఇంటికి వచ్చి, చూడగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఎస్‌ఐ గణేష్‌ బృందం దర్యాప్తు చేపట్టారు. గతంలో వారింటి పనులు చేసిన కాళీఘాట్‌ కాలనీకి చెందిన బొందిలి దిలీప్‌కుమార్‌ అనే వ్యక్తే ఇంటికి వచ్చి, చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు అతడిని విచారణ చేయగా, ఇంటి తాళాలు తీసి, బీరువాలోని ఆభరణాలు దొంగిలించినట్లు అంగీకరించాడని సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఆభరణాలు రికవరీ చేశామన్నారు. ఈ కేసు ఛేదనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ గణేష్‌, కానిస్టేబుళ్లు కె.రామమోహనగౌరి, రామకృష్ణ తదితరులను అభినందించారు.

Advertisement
Advertisement