చికెన్‌ | Sakshi
Sakshi News home page

చికెన్‌

Published Sun, Nov 19 2023 12:44 AM

విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు   - Sakshi

లెండీకి జాతీయ స్థాయి గుర్తింపు

డెంకాడ: జొన్నాడ వద్ద ఉన్న లెండీ ఇంజినీరింగ్‌ కళాశాల అఖిలభారత విద్యామండలి ఎడ్యుస్కిల్స్‌ ఇంటర్న్‌షిప్‌లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంజినీరింగ్‌ విద్యలో ప్రయోగాత్మక విద్యాభ్యాసం, విద్యార్థుల్లో సాంకేతిక నిపుణతను పెంపొందించే దిశగా వివిధ కంపెనీల భాగస్వామ్యంతో ఏటా ఎడ్యుస్కిల్స్‌ జాతీయస్థాయిలో ఇంటర్న్‌షిప్‌ నిర్వహిస్తుంది. 2022–23 విద్యా సంవత్సరానికి మైక్రోచిప్‌, ఏడబ్ల్యూఎస్‌, అల్ట్రాక్స్‌, సెలోనిస్‌, పాలోఆల్టో కంపెనీలలో నెల్వర్ట్‌, క్లౌడ్‌కంప్యూటింగ్‌, ప్రాసెస్‌ మైనింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, సైబర్‌ సెక్యూరిటీలలో 1857 మంది విద్యార్థులు చేసిన ఇంటర్న్‌షిప్‌లకు జాతీయ స్థాయిలో బెస్ట్‌ పెర్‌ఫార్మ్‌ర్‌ ఇనిస్టిట్యూట్‌ విభాగంలో లెండి కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచిందని సంస్థ సెక్రెటరీ, కరస్పాండెంట్‌ కోడూరి శివరామకృష్ణ, ప్లేస్‌మెంట్‌ డీన్‌ ప్రకాష్‌బాబు తెలిపారు. గోవాలో జరిగిన కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్‌సావంత్‌, అఖిలభాతర విద్యామండలి చైర్మన్‌ టి.జి.సీతారామన్‌ చేతుల మీదుగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీవీ రామారెడ్డి అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకుడు పి.జె.జగన్నాథం పాల్గొన్నారు.

సిరిపురం విద్యార్థుల క్రీడా ప్రతిభ

సంతకవిటి: మండల పరిధిలోని సిరిపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు వై.యోచన, ఎ.ఢిల్లీశ్వరరావు ఈ నెల 19 కుంచి 21వ తేదీ వరకు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అండర్‌–14 ఖోఖో పోటీలకు ఎంపికై నట్టు హెచ్‌ఎం వి.వెంకటరావు శనివారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులను, పీడీలను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

బొగ్గు లారీ బోల్తా

రాజాం సిటీ: రాజాంలోని బొబ్బిలి కూడలిలో శనివారం తెల్లవారు జామున బొగ్గులోడుతో వస్తున్న లారీ బోల్తాపడింది. రామభద్రాపురం వైపు నుంచి వస్తున్న లారీ బొబ్బిలి కూడలి నుంచి శ్రీకాకుళం రోడ్డు వైపు తిరిగే క్రమంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. పోలీసులు ఘటనా స్థలంలోని బొగ్గను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయంలేకుండా చేశారు.

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌ లెస్‌

శ్రీ95 శ్రీ160 శ్రీ170

1/2

రోడ్డుపై అడ్డంగా పడిన బొగ్గులారీ
2/2

రోడ్డుపై అడ్డంగా పడిన బొగ్గులారీ

Advertisement
Advertisement