నిరంతర నిఘా | Sakshi
Sakshi News home page

నిరంతర నిఘా

Published Fri, Mar 29 2024 2:00 AM

మీడియా/టీవీ మోనటరింగ్‌ విభాగంలో ఫిర్యాదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి - Sakshi

ఎన్నికల

అక్రమాలపై

కంట్రోల్‌ రూమ్‌ ద్వారా కలెక్టర్‌ పర్యవేక్షణ

నియమావళిని ఉల్లంఘిస్తే సీ–విజిల్‌

ఫిర్యాదు అందిన 100 నిముషాల్లోనే చర్యలు

● 150కి పైగా వినతులు, ఫిర్యాదుల స్వీకరణ

విజయనగరం అర్బన్‌:

న్నికల ప్రక్రియను అత్యంత పారదర్శంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌లో కంప్‌లైంట్‌ సెల్‌ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు. సీ–విజిల్‌, కాల్‌ సెంటర్‌, 1950 హెల్ప్‌లైన్‌ తదితర ఆరు విభాగాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నా రు. అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు వివిధ విభాగాలకు సంబంధించి 150 ఫిర్యా దులు, వినతులు అందాయి. అత్యధికంగా సీ–విజి ల్‌, ఎన్‌జీఎస్‌పీ మాద్యమాల ద్వారా వచ్చాయి. వీటిలో ఇప్పటికే 140 పరిష్కరించారు. ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ను నేరుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. కంప్లైంట్‌ సెల్‌కు జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ) పి.బాలాజీ పర్యవేక్షణాఽధికారిగా వ్యవహరిస్తున్నారు.

సీ–విజిల్‌ యాప్‌

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు, అక్రమాలపై వీలైనంత వేగంగా, సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు ప్రజలకిచ్చిన గొప్ప అవకాశం సీ–విజిల్‌ మొబైల్‌ యాప్‌. ఇటీవలే అందుబాటులో వచ్చిన ఈ యాప్‌ ను పౌరులు ఎవరైనా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏదైనా అంశంపై ఫిర్యాదు చేయడానికి ఈ యాప్‌ను తెరిచి విండో లో సంబంధిత అంశానికి సంబంధించిన ఫొటో లేదా 2 నిముషాల వీడియో తీసి అప్‌లోడ్‌ చేయవ చ్చు. లైవ్‌ ఫొటోలు, వీడియోలు, జియో కోర్డినేట్స్‌ లో సహా ఇది స్వీకరించి పంపుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లేదా ఇతర అధికారులకు సమాచారం వెళ్తుంది. జియో కోఆర్డినేటర్స్‌ ఆధారంగా అధికారులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొనే అవకాశం కలుగుతుంది. ఆ అంశాన్ని స్క్వాడ్‌ పరిశీలించి కేవలం 100 నిముషాల్లోనే చర్యలు తీసుకుంటుంది.

ఓటరు హెల్స్‌లైన్‌ 1950

ఓటర్లకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ ఇది. ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌కు జిల్లాకు చెందిన ఓటర్లు నేరుగా ఫోన్‌చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. కావాల్సిన సేవలను పొందవచ్చు. ఈ కాల్‌ సెంటర్‌ 24 గంటలూ పనిచేస్తుంది. ఇక్కడకు వచ్చిన ఫోన్లను రికార్డు చేసి, చర్యల కోసం సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి పంపిస్తారు.

24 గంటల కాల్‌ సెంటర్‌

ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కాల్‌ సెంటర్‌ ఏర్పాటయ్యింది. ఫోన్‌ నంబర్లు 08922–797120, 08922–797124కు ఫిర్యాదు చేయవచ్చు. ఇవి కూ డా 24 గంటలూ పనిచేస్తాయి. ఇక్కడికి వచ్చే ఫిర్యా దులను, వినతులను తక్షణమే సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటారు. ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నదీలేనిదీ ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు.

చురుగ్గా సోషల్‌ మీడియా విభాగం

ఎన్నిల ప్రక్రియలో సోషల్‌ మీడియా అత్యంత చురుకై న పాత్ర పోషిస్తోంది. ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇన్‌స్ర్ట్రాగామ్‌, యూ ట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియోపై నిరంతర నిఘా పెట్టేందుకు ఈ విభా గం ఏర్పాటైంది. సోషల్‌ మీడియాల్లో వచ్చే ఎన్నిక ల ప్రచారం, ప్రకటనలు, పోస్టింగులపై ఈ విభా గం అధికారులు నిరంతరం పర్యవేస్తున్నారు. రాజకీయ ప్రముఖుల సోషల్‌ మీడియ ఖాతాలపై ప్రత్యే కంగా నిఘా పెట్టి, వారు పెట్టే పోస్టింగ్‌లను పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళిని అతి క్రమించే పోస్టింగ్‌లపై చర్యలు తీసుకుంటున్నారు. దీనిని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వి.శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.

రిపోర్ట్స్‌ మోనటరింగ్‌ సెల్‌

వివిధ విభాగాలకు వచ్చే ఫిర్యాదులు, జిల్లాలో నమోదు చేసిన కేసులు వాటిపై తీసుకున్న చర్యల ను జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ముఖ్య ఎన్నికల అధికారికి ప్రతిరోజు పంపిస్తున్నారు. ప్రవర్తనా నియమావళి అమలు, వ్యయ పరిశీలన అంశాలను నోడల్‌ అధికారులు ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ నుంచే పర్యవేక్షిస్తున్నారు.

1/2

సీ–విజిల్‌ విభాగంలో కంట్రోల్‌ రూమ్‌ పర్యవేక్షణ అధికారి, సీపీఓ పి.బాలాజీ
2/2

సీ–విజిల్‌ విభాగంలో కంట్రోల్‌ రూమ్‌ పర్యవేక్షణ అధికారి, సీపీఓ పి.బాలాజీ

Advertisement
Advertisement