వాస్తవం ఇది.. | Sakshi
Sakshi News home page

వాస్తవం ఇది..

Published Fri, Apr 19 2024 1:15 AM

-

ఆంధ్రప్రదేశ్‌ పునర్వభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతం, రిజర్వ్‌డ్‌ అసంబ్లీ లేదా పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో నిర్మించాలి. దీనికోసం తొలివిడతగా రూ.834 కోట్లను కేటాయించి రూ.426 కోట్లను విడుదల చేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్‌ కో చకచకా పావులు కదిపారు. యూనివర్సిటీ నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కేశారు. ముందుగా విశాఖకు అతి సమీపంలోని కొత్తవలస ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, వాటికి ఆనుకొనిఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం వంటి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతి తక్కవ ధరకు వందల ఎకరాలను కూడబెట్టారు. ప్లాట్‌లు వేశారు. ఇదంతా చూసిన స్థానికులు వీరికేం పిచ్చి.. నివాసయోగ్యంకాని చోట ప్లాట్‌లు వేస్తున్నారని అనుకున్నారు. అప్పుడే మొదలైంది చంద్రబాబు డ్రామా. వారి రియల్‌ వ్యాపారానికి జాతీయ గిరిజన యూనివర్సిటీ పేరు పెట్టారు. నిబంధనలు దాచిపెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారు. 2017 సంవత్సరంలో కొత్తవలస మండ లం రెల్లి రెవెన్యూ గ్రామం అప్పన్న దొరపాలెం సమీపంలో నిర్మాణానికి ఏ మాత్రం అనువుగా లేని కొండ ప్రాంతంలో సర్వే నంబర్‌ 1–8లో 526.24 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో కొంత కొండవాలు ప్రాంతంలో 180 మందికి ఇచ్చిన పట్టా భూమి 185 ఎకరాలను సైతం సేకరించారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందంటూ కేంద్రానికి నివేదికలను పంపారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా హడావిడిగా అప్పటి భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో 2017 డిసెంబర్‌ నెలలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి ఈ ప్రాంతం వర్సిటీ నిర్మాణానికి అనువుగా లేదని, ఈ ప్రాంతం ఎస్టీ సెగ్మెంట్‌లో లేదని వ్యతిరేకించారు. నివేదిక సైతం ఇచ్చారు. అయినా.. తమ రియల్‌ ఎస్టేట్‌వ్యాపారం పూర్తయ్యేవరకు చంద్రబాబు అండ్‌ కో ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. తమ అనుకూల మీడియాతో ఈ ప్రాంతం ఆంధ్రాయూనివర్సిటీ పరి సరాల వలే అభివృద్ధి చెందుతుందని, వర్సిటీ ప్రహరీ పనులు ప్రారంభమైపోయాయంటూ ఊహాజనిత కథనాలతో ప్రచారం చేశారు. ఒక్క ప్రహరీతో కారుచౌకగా కొనుగోలు చేసిన భూ ములను వందలకోట్ల రూపాయలకు అమ్మేసి.. కొనుగోలుదారులకు పంగనామం పెట్టారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement