రెండు రాష్ట్రాల..... | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 7:44 PM

-

రెండు రాష్ట్రాల సరిహద్దులోని జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గంపై ప్రస్తుత లీడర్‌కు మంచి పట్టు ఉంది. ఈసారి కూడా టికెట్‌ తనకే వస్తుందనే ధీమా ఉన్నప్పటికీ.. జిల్లాస్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరు ఆ సీటును ఆశిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మరొకరు కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ బీజేపీ నుంచి గట్టిపోటీ ఉంది. ఈ క్రమంలో పోటీ నువ్వా..నేనా అన్నట్లు ఉండడం, సొంత పార్టీలోని కొందరు తనకు నచ్చని వారితో కలిసి ఉండడాన్ని ముఖ్యనేత జీర్ణించుకోలేక అసహనానికి గురవుతున్నట్లు సమాచారం.

‘నేను లేకుండా రాజకీయాలు చేయలేరు. టికెట్‌ నాకు రాదనేది ప్రచారం మాత్రమే. నా వర్గం నాకుంది. గెలిచేది నేనే. నేను గెలిచినప్పుడు చూపిస్తా. ఇప్పుడు కూడా నన్ను కాదని పనులు చేసుకోండి. ఎట్ల చేస్తారో నేనూ చూస్తా.’ – రాష్ట్ర సరిహద్దులోని

జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ లీడర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement