నిఘా నీడలో.. | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో..

Published Sun, Sep 10 2023 12:34 AM

-

ల్లమల అటవీ ప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాలు ఆధ్మాతిక, ఆహ్లాదకరమైన పర్యాటకానికి చిరునామాగా మారాయి. ఇంతటి ప్రాముఖ్యత గల అటవీ సంపదను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అడవిని కాపాడండి.. అడవిని విస్తరించండి అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు. అడవి రక్షణతో పాటు పులుల సంరక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఎలక్ట్రానిక్‌–ఐ (ఈ–కన్ను) నిఘా వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తోంది. ఆటోమేటిక్‌ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, బేస్‌ క్యాంపులు, చెక్‌పోస్టుల ఏర్పాటుతో నిఘా పటిష్టం చేసింది. జీపీఎస్‌ మొబైల్‌ అనుసంధానం యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ విధానంలో వివిధ సెన్సిటివ్‌ జోన్లలో హైరెజుల్యూషన్‌ థర్మల్‌, ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల ద్వారా పులులు, మనుషుల కదలికలను రికార్డు చేస్తోంది. ఉన్నతాధికారుల సెల్‌ఫోన్‌కు జంతువుల కదలిక, ఇతర ఘటనలకు సంబంధించి అలర్ట్‌లు, నోటిఫికేషన్లు వచ్చే సాంకేతికతను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement