8 గంటల పాటు ఉత్కంఠ | Sakshi
Sakshi News home page

8 గంటల పాటు ఉత్కంఠ

Published Tue, Nov 14 2023 1:34 AM

-

దేవరకద్ర రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు పరిశీలన ప్రారంభం కాగా.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డి నామినేషన్‌పై అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. చిన్నచింతకుంట మండలంలో ఒక ఓటు, హైదరాబాద్‌లో మరో ఓటు ఉన్నాయని.. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఎలా ఉంటుందని ఫిర్యాదు చేశారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలనిపట్టుపట్టారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి నటరాజ్‌ ఉన్నతాధికారులను సంప్రదించారు. నామినేషన్ల పరిశీలనలో వచ్చిన ఫిర్యాదుపై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డి, ఆయనకు తోడుగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ఆర్‌ఓ కార్యాలయంలోనే రాత్రి వరకు ఉన్నారు. మరోవైపు అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండ ప్రశాంత్‌రెడ్డి, ఇతర అభ్యర్థులు ఆర్‌ఓ కార్యాలయంలోనే ఉండిపోయారు. చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఇచ్చిన వివరణలకు సంతృప్తి చెందిన ఆర్‌ఓ నామినేషన్‌ను ఓకే చేశారు.

Advertisement
Advertisement