-

ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి

23 Sep, 2023 01:22 IST|Sakshi
బంధనపల్లి గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి : ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మైలారం, బంధనపల్లి గ్రామాలకు చెందిన కార్యకర్తలు శుక్రవారం మంత్రిని కలిశారు. పలు అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంజూరు చేశారు. జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌లు లేతాకుల సుమతి, దీప్లానాయక్‌, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, గాడిపల్లి వెంకన్న, గబ్బెట బాబు, పరుపాటి రవీందర్‌రెడ్డి, ఉల్లెంగుల నర్సయ్య, వెంకన్న, మాధవరెడ్డి, యాకయ్య, రాములు అశ్రఫ్‌పాషా, ఎల్కపల్లి రమేష్‌, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు