సౌత్‌ జోన్‌ టోర్నమెంట్‌కు కేయూ జట్టు | Sakshi
Sakshi News home page

సౌత్‌ జోన్‌ టోర్నమెంట్‌కు కేయూ జట్టు

Published Sat, Nov 11 2023 1:36 AM

- - Sakshi

కేయూ క్యాంపస్‌: తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేరళలో ఈనెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ వర్సిటీ బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ పోటీలకు కేయూ బాస్కెట్‌బాల్‌ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావు శుక్రవారం తెలిపారు. ఈజట్టులో యశ్వంత్‌ (విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల), ఎం.తరుణ్‌, టి.కన్నారావు, ఎస్‌.సందీప్‌, కె.సాయితేజ (మహబూబాబాద్‌ ఎస్‌ఆర్‌ కళాశాల), ఎం.దిలీప్‌, టి.విశ్వనాఽథ్‌, (వరంగల్‌ ఎల్‌బీ కళాశాల), బి.నిషాల్‌ (ఖమ్మం కవిత డిగ్రీ కళాశాల), మహ్మద్‌ మొయినుద్దీన్‌ (హనుమకొండ వాగ్దేవి కళాశాల), షేక్‌ ముజమిల్‌ (హనుమకొండ కేడీసీ), జె.అభిషేక్‌ (వరంగల్‌ కిట్స్‌ కళాశాల) ఉన్నారు. ఈజట్టుకు బొల్లికుంట వాగ్దేవి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.దేవేందర్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారని శ్రీనివాస్‌రావు తెలిపారు.

టీపీయూఎస్‌ జిల్లా నూతన

కార్యవర్గం ఎన్నిక

విద్యారణ్యపురి: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) హనుమకొండ జిల్లా స్థాయి సమావేశాన్ని శుక్రవారం హునుమకొండలోని సామజగన్మోహన్‌ స్మారక భవనంలో నిర్వహించారు. వివిధ ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించిన అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీపీయూఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బత్తిని వీరస్వామిగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మునికుంట్ల సంగెం శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీపీయూఎస్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కానుగంటి హనుమంతురావు పర్యవేక్షణలో ఈఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల టీపీయూఎస్‌ అధ్యక్ష, జనరల్‌ సెక్రటరీలు ఇతర బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేఎంసీలో

వైట్‌ కోట్‌ వేడుకలు

ఎంజీఎం: కాకతీయ మెడికల్‌ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్‌ డే, వైట్‌ కోట్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో పాటు హిప్పోక్రోటిక్‌ ప్రమాణం, ఫ్రెషర్స్‌ డేను ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ పేర్కొన్నారు. ఈసందర్భంగా కేఎంసీ క్రానికల్‌ కాలేజ్‌ మ్యాగజైన్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాంకుమార్‌రెడ్డి, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఈహెచ్‌ సూపరింటెండెంట్‌ గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు తెలంగాణ పీపుల్స్‌

జేఏసీ సమావేశం

హన్మకొండ: ‘రాష్ట్రంలో పదేళ్ల పాలన, ప్రజల ఆకాంక్షలు–కర్తవ్యాలు’ అంశంపై తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సదస్సు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ పీపుల్స్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వీరితో పాటు పలువురు మేధావులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.

1/1

Advertisement
Advertisement