ముగిసిన కళా ఉత్సవ్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

ముగిసిన కళా ఉత్సవ్‌ పోటీలు

Published Sat, Nov 11 2023 1:36 AM

- - Sakshi

విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కళాఉత్సవ్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. పది అంశాల్లో పోటీలు నిర్వహించగా.. 19 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. శుక్రవారం సాయంత్రం ముగింపు సభలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ ఎ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. సమావేశంలో సోషల్‌ ఫోరం జిల్లా కో–ఆర్డినేటర్‌ మధుసూధన్‌రెడ్డి, పీఎస్‌ హెచ్‌ఎం ఉప్పలయ్య, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం జగన్‌, ఉపాధ్యాయులు సతీశ్‌ ప్రకాశ్‌, నవీన్‌కుమార్‌, అశోక్‌, వెంకటయ్య, రేవతి, జయ తదితరులు పాల్గొన్నారు. కాగా.. జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ విజేతలకు ప్రశంసపత్రాలు అందించారు.

విజేతలు వీరే..

విజేతలుగా డ్యాన్స్‌ క్లాసికల్‌ జి.స్నిగ్ధ (ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, ధర్మసాగర్‌), డ్యాన్స్‌ ఫోక్‌ ఐ.వెంకటరాజు సేయింట్‌ థెరిస్సా పాఠశాల (ఆత్మకూరు), టి.వెన్నెల (సేయింట్‌ గాబ్రియల్‌ పాఠశాల కాజీపేట) ఇండిజనస్‌ టాయ్స్‌ అండ్‌ గేమ్స్‌ ఎన్‌.మధుకిరణ్‌ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాజీపేట), కె.నందిని (ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాజీపేట) ఉన్నారు.

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

కాళోజీ సెంటర్‌: సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు పాఠశాల విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తయారు చేసేది సైన్స్‌ కాంగ్రెస్‌ అని డీఈఓ వాసంతి అన్నారు. వరంగల్‌లో 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లాస్థాయి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. జిల్లాలో ఈసారి 104 ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయి. వాటి నుంచి నాలుగు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, డీసీఈబీ కార్యదర్శి జి.కృష్ణమూర్తి, సురేశ్‌బాబు, కృష్ణరాం గోపాల్‌, కిరణ్‌, గైడ్‌ టీచర్స్‌ శ్రవణ్‌, రాజు, ధనలక్ష్మి, వాసు, పరమేరశ్వర పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయికి 19 మంది విద్యార్థులు

విజేతలకు ప్రశంసపత్రాల అందజేత

విజేతలకు బహుమతులు అందజేస్తున్న డీఈఓ వాసంతి, జిల్లా సైన్స్‌ అధికారి  కట్ల శ్రీనివాస్‌
1/1

విజేతలకు బహుమతులు అందజేస్తున్న డీఈఓ వాసంతి, జిల్లా సైన్స్‌ అధికారి కట్ల శ్రీనివాస్‌

Advertisement
Advertisement