సంస్థ అభివృద్ధిలో సిబ్బంది సేవలు కీలకం | Sakshi
Sakshi News home page

సంస్థ అభివృద్ధిలో సిబ్బంది సేవలు కీలకం

Published Sat, Nov 11 2023 1:36 AM

మాట్లాడుతున్న సీఎండీ ప్రభాకర్‌రావు  - Sakshi

దామెర: విద్యుత్‌ సంస్థ అభివృద్ధిలో సిబ్బంది సేవలు కీలకమని టీఎస్‌ ట్రాన్స్‌కో చైర్మన్‌ అండ్‌ డైరెక్టర్‌ దేవులపల్లి ప్రభార్‌రావు అన్నారు. మండలంలోని దుర్గంపేట సమీపంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో 1993లో జేఎల్‌ఎం(హెల్పర్లుగా) విధుల్లో చేరి వివిధ హోదాల్లో ఉన్నవారు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ప్రభాకర్‌రావు హాజరై మాట్లాడుతూ.. 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో సిబ్బంది పాత్ర మరువలేనిదని కొనియాడారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ స్థానం, విద్యుత్‌ వినియోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం గుజరాత్‌ తర్వాతి స్థానంలో ఉందన్నారు. టీఎస్‌ ఎన్‌సీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికనుగుణంగా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారన్నారు. సమావేశంలో డైరెక్టర్లు గణపతి, మోహన్‌రెడ్డి, సంధ్యారాణి, టీవీ రావు, తిరుపతిరెడ్డి, ఐఎన్టీయూసీ యూనియన్‌ నాయకులు శ్రీధర్‌, సత్యనారాయణ, సదయ్య, బుచ్చయ్యగౌడ్‌, నరేందర్‌రెడ్డి, నీలం ఐలేశ్‌, సిరూరి సుగుణాకర్‌, వేణుగోపాల్‌, స్థానిక ఏఈ గుర్రం రమేశ్‌, పెద్ద ఎత్తున 93వ బ్యాచ్‌ సిబ్బంది దంపతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విధి నిర్వహణలో అసువులుబాసిన సిబ్బంది బంధువులను, ఉద్యోగ విరమణ పొందిన, ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల దంపతులను మెమొంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సంగీత విభావరిలో ఉద్యోగులంతా తమ ఆటపాటలతో అలరించారు.

టీఎస్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

ఘనంగా 93వ బ్యాచ్‌

జేఎల్‌ఎం ఆత్మీయ సమ్మేళనం

Advertisement
Advertisement