పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం | Sakshi
Sakshi News home page

పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం

Published Sun, Nov 19 2023 1:02 AM

- - Sakshi

విద్యారణ్యపురి: పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనివార్యమని, అందుకోసం ప్రతీ నెల మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నా రు. శనివారం హనుమకొండ జిల్లా తరాలపల్లి పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రతీ రోజు పాఠశాలకు పంపాలని, వారిలోని సామర్థ్యాలను గుర్తించాలన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పిల్లల భద్రతా వారో త్సవాలు నిర్వహిస్తున్నందున అందుకు సంబంధించి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించా రు. సమావేశంలో కమ్యూనిటీ మొబిలైజేషన్‌ కో–ఆర్డినేటర్‌ రాధ, హెచ్‌ఎం అరుణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సమగ్ర విధానాలతో

సంపూర్ణ ఆరోగ్యం

విద్యారణ్యపురి: ప్రకృతి, ఆహార నియమాలతోపాటు సమగ్ర విధానాల్ని ఆచరిస్తేనే మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని హనుమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎండీ యాకూబ్‌పాషా అన్నారు. శనివారం ప్రకాశ్‌రెడ్డిపేటలోని ఆచార్య గజ్జల రామేశ్వరం అంతర్జాతీయ నేచురోపతి లైబ్రరీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో నేషనల్‌ నేచురోపతి డే వేడుకల్ని నిర్వహించారు. పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసిన రామేశ్వరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న యాకూబ్‌పాషా అభినందించారు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పాషాను, కాజీపేట పతంజలి యోగా నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రి వైద్యులు సుదర్శన్‌ను గజ్జల రామేశ్వరం సన్మానించారు. సమావేశంలో ప్రొఫెసర్లు వి.రాంచంద్రం, రాధికారాణి, రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుధాకర్‌రావు, హనుమకొండ పతంజలి యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు జితేందర్‌, కవి, రచయిత వీఆర్‌ విద్యార్థి, వైద్యులు సమ్మయ్య, దేవరకొండ సత్యప్రకాశ్‌, కేయూ రిటైర్డ్‌ ఆచార్యులు కిష్టయ్య, లైబ్రేరియన్‌ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నిట్‌మాస్‌–23

కాజీపేట అర్బన్‌: నిట్‌ ఆడిటోరియంలో శనివా రం విద్యార్థులు నిట్‌మాస్‌–23 పేరిట ముందస్తుగా క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌, తర్వాత సెలవులు ఉండడంతో క్రిస్మస్‌ పండుగకు కళాశాలలో అందుబాటులో ఉండని సందర్భంగా ఈవేడుకలు జరుపుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. రాబోయే క్రిస్మస్‌ సందర్భంగా ఏసు క్రీస్తు జననం, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ జింగిల్‌ బెల్‌.. జింగిల్‌ బెల్‌ అంటూ పాటలతో అలరించారు. క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. డీన్‌లు శ్రీనివాసాచార్య, ఎడ్వర్డ్‌ విలియమ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

సౌత్‌ జోన్‌ టోర్నమెంట్‌కు

మహిళా జట్టు

కేయూ క్యాంపస్‌: తమిళనాడులో ఈనెల 22 నుంచి 26 మధ్య నిర్వహించనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ వర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌కు కేయూ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ శ్రీనివాస్‌రావు శనివారం తెలిపారు. ఈజట్టులో ఎస్‌.పూజిత (వరంగల్‌ టీఎస్‌డబ్ల్యూ ఆర్డీసీ), కె.భవాని, బి.ప్రియాంక, జె.అశ్విని, ఎం.స్వప్న (ఖమ్మం టీఎస్‌డబ్ల్యూ ఆర్డీసీ), కె.శ్రావణి (ఖమ్మం డీఆర్‌ఎస్‌ డిగ్రీ కళాశాల), పి.శిరీష (బొల్లికుంట వాగ్దేవి ఫార్మసీ కళాశాల), ఎం.కుసుమ కొత్తగూడెం(టీఎస్‌డబ్ల్యూ ఆర్డీసీ). ఎ.చందన (హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎ.సోంబాయి (ఆసిఫాబాద్‌ టీటీడబ్ల్యూ ఆర్డీసీ), ఎ.మౌనిక (వరంగల్‌ ఎల్‌బీ కళాశాల), బి.సుజాత (కేయూ వ్యాయామ కళాశాల) ఉన్నారు. వీరికి కోచ్‌గా విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎస్‌.కుమారస్వామి, మేనేజర్‌గా బొల్లికుంట వాగ్దేవి వ్యాయామ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సునీల్‌రెడ్డి వ్యవహరిస్తారని శ్రీనివాస్‌రావు తెలిపారు.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement