వైభవంగా శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

Published Tue, Dec 19 2023 1:00 AM

- - Sakshi

హన్మకొండ కల్చరల్‌ : హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి, వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో మార్గశిర శుద్ధషష్టి సోమవారం సుబ్రహ్మణ్యషష్టిని పురస్కరించుకుని శ్రీవల్లిదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆయా ఆలయాల ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వేదపండితులు శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవ విగ్రహలను ప్రతిష్ఠించి అభిషేకాలు చేసిన అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. భద్రకాళి ఆలయంలో జరిగిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.

Advertisement
Advertisement