మామిడి పూతకు మంచు దెబ్బ | Sakshi
Sakshi News home page

మామిడి పూతకు మంచు దెబ్బ

Published Sat, Mar 11 2023 9:40 AM

మెట్ట ప్రాంతంలో పూతమీద ఉన్న మామిడి తోట   - Sakshi

రాష్ట్రస్థాయి పద్య కవితల పోటీలకు ఆహ్వానం

తణుకు టౌన్‌: ఉగాది సందర్బంగా తణుకులోని నన్నయ్య భట్టారక పీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పద్య కవితల పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు పీఠం ప్రధాన కార్యదర్శి సుశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ‘నన్నయ – రాజరాజ నరేంద్రుల అనుబంధం’ అనే అంశంపై పద్య కవితలను, ఐదు పద్యాలను రాసి పంపించాలని కోరారు. అవి స్వీయ రచనలై ఉండాలని స్పష్టం చేశారు. వెనుక భాగంలో చిరునామా, ఫోన్‌ నంబర్లు వేయాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల విజేతలకు సత్కారం, పారితోషికం, ప్రశంసా పత్రం వంటి వాటిని ఈ నెల 22వ తేదీ ఉగాది సందర్భంగా అందజేస్తారని తెలిపారు.

జిల్లా స్థాయిలో... నన్నయ భట్టారక పీఠం ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఉగాది సందర్భంగా జిల్లా స్థాయిలో సుమతీ శతకం నుంచి పద్యాలు చూడకుండా చదివే పోటీలను నిర్వహిస్తున్నట్టు సుశర్మ తెలిపారు. ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు మొదటి విభాగం, ఐదు నుంచి ఏడో తరగతి వరకు రెండో విభాగం, ఎనిమిదో తరగతి నుంచి 10వ తరగతి వరకు మూడో విభాగం, కళాశాల స్థాయి వారు నాలుగో విభాగంగా గుర్తించి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ పోటీలు ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి నిర్వహిస్తారని తెలిపారు. విజేతలకు ఉగాది సందర్భంగా ఈ నెల 22న బహుమతి ప్రదానం జరుగుతుందని పేర్కొన్నారు.

హెచ్చరించిన అటవీ, పోలీసు అధికారులు

సిబ్బందితో గ్రామంలో కవాతు

చింతలపూడి : తేనె మంచు ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలోని మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. పూత పూసిన ప్రాంతంలో మామిడి పంట మంచు దెబ్బకు విలవిల్లాడుతోంది. గత రెండు, మూడేళ్లుగా ఽఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు మామిడి పంటపై గంపెడాశతో ఉన్నారు. ఏడాదంతా సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత, పిందె మాడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధరపై ప్రభావం...

మంచు వల్ల మామిడి కాయలకు మంగు తెగులు సోకి మార్కెట్‌లో ధర తగ్గే అవకాశం ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమ స్థానం ఆక్రమించి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన మామిడి పంటకు మెట్ట ప్రాంతంలో గడ్డు కాలం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దశాబ్దాల పాటు కన్న బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న మామిడి తోటలను రైతులు గత్యంతరం లేక గత కొద్ది సంవత్సరాలుగా తొలగిస్తూ వస్తున్నారు. జిల్లాలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం, ద్వారకాతిరుమల, నల్లజర్ల, టి.నరసాపురం ప్రాంతాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మరోపక్కమామిడి తోటల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టి రైతులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది.

ఆశాజనకంగా పూత

ఈ సంవత్సరం వాతావరణ అనుకూల పరిస్థితుల కారణంగా మామిడి తోటలు 70 శాతానికి మించి పూత పూశాయి. వచ్చిన పూత, పిందెలను కాపాడుకోవడానికి రైతులు సరైన సస్య రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ లేదా 50 గ్రాముల యూరియా ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుందని అధికారులు తెలిపారు.

స్థానిక వార్తలు

దిగుబడిపై రైతుల్లో ఆందోళన

సస్యరక్షణ చర్యలు మేలంటున్న ఉద్యాన అధికారులు

తేనే మంచు పురుగు నివారణ ఇలా...

ప్రస్తుతం మామిడి పూతపై తేనె మంచు పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది. లేత పూమొగ్గలు వస్తున్న దశలో తేనె మంచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌ (కాన్ఫిడార్‌) ద్రావణం 10 లీటర్ల నీటికి మూడు మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్‌ 10 లీటర్ల నీటికి మూడు గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు ఉద్ధృతి తగ్గుతుంది. – ఎ.దుర్గేష్‌, ఉద్యాన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

తేనె మంచు పురుగు సోకిన మామిడి పూత
1/3

తేనె మంచు పురుగు సోకిన మామిడి పూత

కొత్తగూడెంలో అటవీ, పోలీసు అధికారులు 
సిబ్బందితో కవాతు నిర్వహిస్తున్న దృశ్యం
2/3

కొత్తగూడెంలో అటవీ, పోలీసు అధికారులు సిబ్బందితో కవాతు నిర్వహిస్తున్న దృశ్యం

3/3

Advertisement
Advertisement