బాలింతలకు బాసటగా 102 సేవలు | Sakshi
Sakshi News home page

బాలింతలకు బాసటగా 102 సేవలు

Published Sun, Mar 19 2023 1:16 AM

- - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102) వాహనాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుండటంపై బాలింతల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 102 వాహనాల ద్వారా ఉచితంగా బాలింతలను సురక్షితంగా ఇంటికి చేర్చడంతో పాటు రవాణా భారం తగ్గి ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ఆస్పత్రిలో ఉచిత డెలివరీ, తల్లీబిడ్డను ఇంటికి సురక్షితంగా చేరుస్తుండటంపై పేద, మధ్య తరగతి వర్గాల మహిళలు 102 వాహన సేవలను ప్రశంసిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

వందేభారత్‌ రైలు రూపకర్త సుధాన్షు మణి

భీమవరం (ప్రకాశం చౌక్‌): గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో 102 వాహన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాకు 14 వాహనాలను కేటాయించగా, అవి భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మూడు డివిజన్లలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాయి. నెలకు సుమారు 600 మంది చొప్పున ఇప్పటివరకు 7,200 మంది బాలింతలను సురక్షతంగా గమ్యస్థానాలకు చేర్చాయి.

అన్ని వాహనాల్లోనూ ఏసీ సౌకర్యం

బాలింతకు, చంటి బిడ్డకు ఉక్కపోత ఇబ్బందులు లేకుండా 102 వాహనంలో ఏసీ సౌకర్యం కల్పించారు. వాహనంలో సౌకర్యవంతమైన సీటింగ్‌ సదుపాయం ఉంది. తల్లీబిడ్డను భద్రతగా తీసుకువెళ్లడానికి వాహనానికి జీపీఎస్‌ నెట్‌వర్క్‌ అనుసంధానం చేశారు. దీంతో వాహనం ఎక్కడ ఉందో అధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అధికారులు తెలుసుకునే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది.

జిల్లాలో వాహనాల వివరాలు ఇలా

జిల్లాలోని తణుకు జిల్లా ఆస్పత్రికి 6 వాహనాలు, భీమవరం ఏరియా ఆస్పత్రికి 1, నర్సాపురం ఏరియా ఆస్పత్రికి 2, పాలకొల్లు ఏరియా ఆస్పత్రికి 1, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి 1, పెంటపాడు పీహెచ్‌సీకి 1, పెనుగొండ పీహెచ్‌సీకి 1, ఆచంట పీహెచ్‌సీకి 1 చొప్పున కేటాయించారు. వీటిపై 14 మంది పైలెట్లు పనిచేస్తున్నారు.

తాడేపల్లిగూడెం : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని భారతీయ రైల్వే ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ మాజీ జనరల్‌ మేనేజర్‌ సుధాన్షుమణి అన్నారు. శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న అన్వేషణ టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా విద్యార్థులు ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. జాతీయస్థాయి ఫెస్టులలో విద్యార్థులు భాగస్వాములై నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. భారతీయ రైల్వేల విశిష్టత, వందేభారత్‌ రూపకల్పన విషయాల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. కళాశాల చైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు దేశానికి విశిష్ట సేవలు చేసిన గొప్పవారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి సుధాన్షుమణి, కళాశాల వైస్‌ చైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణ, సెక్రటరీ మేకా క్రాంతిసుధ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ బహుమతులను అందజేశారు. అన్వేషణ–2023 కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

ఆకివీడులో ఆస్పత్రి నుంచి 102 వాహనంలో బాలింతను క్షేమంగా ఇంటి వద్ద దింపిన దృశ్యం

తణుకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 102 వాహనంలో బాలింతను తరలిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం : ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. జంగారెడ్డిగూడెంలో పరీక్ష నిర్వహణ సందర్భంగా ప్రశ్నపత్రం విషయంలో జరిగిన వివిధ పొరపాట్ల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తొలిరోజైన శనివారం బీఎస్సీ కంప్యూటర్స్‌ విద్యార్థులకు మ్యాథమెటిక్స్‌ 5ఏ పరీక్ష మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల మధ్య నిర్వహించాల్సి ఉంది. ప్రశ్నపత్రం ఆలస్యం కావడం, అందులో ఖాళీలు రావడం, ఓవర్‌ ప్రింట్‌ కావడం వంటి కారణాలతో యూనివర్సిటీ వారు అరగంట వ్యవధిలో మరో ప్రశ్నపత్రం పంపారు. రెండోసారి వచ్చిన ప్రశ్నపత్రాన్ని సదరు కళాశాల యాజమాన్యం ప్రింట్‌ ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి గదికీ వెళ్లి నోటితో చెప్పించడంతో దాదాపు గంట సమయం వృథా అయింది. విద్యార్థులకు మాత్రం పరీక్ష రాసేందుకు అరగంట మాత్రమే సమయాన్ని పొడిగించారు. ఈ గందరగోళం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురై పరీక్ష సరిగా రాయలేకపోయారని, మరోసారి పరీక్ష నిర్వహించడం లేదా గ్రేస్‌ మార్కులు ఇవ్వడం ద్వారా విద్యార్థులు నష్టపోకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మెట్టలో వడగళ్ల వాన

స్థానిక వార్తలు

డిగ్రీ పరీక్ష పేపర్‌లో గందరగోళం

చాలా జాగ్రత్తగా ఇంటికి చేర్చారు

ఇటీవలే నాకు ఆకివీడు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేశారు. తరువాత పైసా ఖర్చు లేకుండా తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ వాహనంలో నన్ను, చంటిబిడ్డను చాలా జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. సురక్షితంగా తీసుకురావడం సంతోషంగా అనిపించింది. ఈ వాహనం బాలింతలకు చాలా ఉపయోగపడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి 102 వాహనంలో వెళ్లడమే సురక్షితం. ప్రభుత్వం చాలా మంచి సర్వీసు అందిస్తోంది.

– ఎ.గీతాప్రియ, బాలింత, ఆకివీడు

ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు

జిల్లాలో 102 వాహనాలు మొత్తం 14 ఉన్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారని మాకు సమాచారం అందగానే వెంటనే 102 వాహనం అందుబాటులో ఉంచి తల్లీబిడ్డను 102 వాహనంలో సురక్షితంగా వారి ఇంటికి చేరుస్తున్నాం. ఉచిత సర్వీసు అని బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. బాలింతలను ఇంటి వద్దకు చేర్చేవరకు 102 వాహనాలను జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తుంటాం.

– టి.శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్‌, 102 విభాగం

సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌

పశ్చిమలోని 7 ఆస్పత్రుల్లో సిద్ధంగా 14 వాహనాలు

నెలకు 600 మంది బాలింతలకు ఉచితంగా సేవలు

గతేడాది నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో

1/5

2/5

అగ్నిప్రమాదం జరిగిన షాపు
3/5

అగ్నిప్రమాదం జరిగిన షాపు

4/5

5/5

Advertisement
Advertisement