ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

Published Tue, May 23 2023 1:18 AM

-

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌వీ రవిసాగర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పదో తరగతిలో 1,247 మందికి 167 మంది, ఇంటర్‌లో 2,276 మందికి 864 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. టెన్త్‌లో 13.39 శాతం, ఇంటర్‌లో 37.96 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిందని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ కోసం ఈనెల 30లోపు ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. అనుత్తీర్ణులైన అభ్యర్థులకు పబ్లిక్‌ పరీక్షలు జూన్‌ 26 నుంచి జూలై 4 వరకూ, ప్రయోగ పరీక్షలు జూలై 5 నుంచి 7వ వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సబ్జెక్టుకు 10వ తరగతి అభ్యర్థులు రూ.100, ఇంటర్‌ అభ్యర్థులు రూ.150, ప్రయోగ పరీక్షలకు రూ.100 చొప్పున ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. అపరాధ రుసుం రూ.25తో ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకూ, రూ.50తో ఈనెల 30, 31 తేదీల్లో ఫీజులు చెల్లించవచ్చని సూచించారు. తత్కాల్‌ పద్ధతిలో 10వ తరగతికి రూ.500, ఇంటర్‌కు రూ.1,000 అపరాధ రుసుంతో జూన్‌ 1, 2 తేదీల్లో ఫీజులు చెల్లించవచ్చని వివరించారు.

Advertisement
Advertisement