15 నుంచి కుంకుళ్లమ్మ ఆలయంలో ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

15 నుంచి కుంకుళ్లమ్మ ఆలయంలో ఉత్సవాలు

Published Tue, Oct 10 2023 12:32 AM

- - Sakshi

రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్ర దేవతగా విరాజిల్లుతోన్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 15 నుంచి వచ్చేనెల 23 వరకు జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అందులో భాగంగా ఈనెల 15న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 16న శ్రీ గాయత్రి దేవిగా, 17న శ్రీ అన్నపూర్ణా దేవిగా, 18న శ్రీ మహాలక్ష్మిగా, 19న శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, 20న మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 21న శ్రీ దుర్గాదేవిగా, 22న శ్రీ మహిషాసుర మర్దనిగా అమ్మవారు దర్శనమిస్తారని ఈఓ తెలిపారు. ఉత్సవాల ముగింపు రోజైన 23న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులను కటాక్షిస్తారని, అదేరోజు సాయంత్రం క్షేత్రంలో అమ్మవారి రథోత్సవం, 24న దీక్షాదారుల ఇరుముడి సమర్పణ, చండీహోమాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తామని ఈఓ పేర్కొన్నారు. 25న ఆలయం వద్ద భారీ అన్నసమారాధన జరుపుతామని తెలిపారు. యవన్మంది భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.

1/1

Advertisement
Advertisement