Sakshi News home page

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

Published Wed, Nov 15 2023 12:38 AM

తణుకు గ్రంథాలయంలో నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి కారుమూరి  - Sakshi

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తణుకు టౌన్‌: విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన పురుషుల జిల్లా గ్రంథాయాలన్ని మంగళవారం మంత్రి కారుమూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలను అందరూ తమ అవసరాలకు అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో బాలల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. విద్యా రంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా విద్యలో మన రాష్ట్రం గతంలో 15వ స్థానంలో ఉండగా నేడు 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. రాబోయే కాలంలో మన రాష్ట్ర మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. నెహ్రూ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ చిట్టూరి వెంకట సుబ్బారావు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మంగెన సూర్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సూరంపూడి కామేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement