ఆర్జీయూకేటీ యోగాసన జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీ యోగాసన జట్టు ఎంపిక

Published Thu, Nov 16 2023 12:54 AM

ఎంపికై న యోగా విద్యార్థులతో అధికారులు - Sakshi

నూజివీడు: సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల యోగాసన పోటీల్లో పాల్గొనేందుకు ఆర్జీయూకేటీ జట్టును ఎంపిక చేశారు. దీనికి గాను నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాలుగు ట్రిపుల్‌ఐటీలకు చెందిన యోగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురను ఎంపిక చేశారు. ఎంపికై న 12 మందీ నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన వారే కావడం విశేషం. బాలుర జట్టుకు కే లక్ష్మణరావు, ఆర్‌ శేషసురేష్‌, పీ ఆదిశంకరరెడ్డి, టీ అశోక్‌, పీ సురేష్‌, పీ భరత్‌ కుమార్‌ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు ఏ ప్రవీణ, కే సౌమ్య, ఎన్‌ వెంకట భార్గవి, ఎస్‌.ప్రమీల, పీ ప్రియాంక, ఏ నిఖిల ఎంపికయ్యారు. వీరందరూ డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లిలోని అన్నా యూనివర్శిటీలో నిర్వహించే యోగా పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికై న విద్యార్థులను బుధవారం డైరెక్టర్‌ ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు, ఏవో ప్రదీప్‌, డీన్‌ అకడమిక్స్‌ లక్ష్మణరావు తదితరులు అభినందించారు.

హ్యాండ్‌బాల్‌ జాతీయ పోటీలకు ఎంపిక

కామవరపుకోట: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు కామవరపుకోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని బొల్లిబోయిన సాయిలహరి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామసుందరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా పడమట జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలలో తమ పాఠశాలకు చెందిన సాయి లహరి విశేష ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. విద్యార్థినికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు తూంపాటి బాబురావు, గుడిదల శ్యామలాదేవిలను హెచ్‌ఎం రామసుందరి, విద్యా కమిటీ చైర్మన్‌ పండు జగదీష్‌ గ్రామస్తులు అభినందించారు.

విద్యార్థిని సాయిలహరితో పాఠశాల 
ఉపాధ్యాయులు
1/1

విద్యార్థిని సాయిలహరితో పాఠశాల ఉపాధ్యాయులు

Advertisement
Advertisement