‘లింగపాలెం’లో కలకలం | Sakshi
Sakshi News home page

‘లింగపాలెం’లో కలకలం

Published Thu, Nov 16 2023 12:54 AM

-

లింగపాలెం: లింగపాలెం మండలానికి చెందిన పాడి రైతులపై సంగం డెయిరీ సిబ్బంది దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన ద్వారకా మిల్క్‌ సెంటర్‌ యజమాని, టీడీపీ నాయకుడు, సర్పంచ్‌ ముసునూరి రాముతోపాటు నరసన్నపాలెం గ్రామ టీడీపీ నాయకుడు, సర్పంచ్‌ కూరపాటి రత్తయ్య మరికొందరు రైతులపై గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో సంగం డెయిరీ సిబ్బంది బుధవారం దాడి చేశారు. రైతుల పాలకు రావాల్సిన రూ.50 లక్షల బోనస్‌ సొమ్ముల కోసం వెళ్లగా తమపై దాడి చేశారని బాధితులు వాపోతున్నారు. ద్వారకా మిల్క్‌ పాయింట్‌తో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీ పాలు పోసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మేరకు పాలు పోసినట్టు సర్పంచ్‌లు రాము, రత్తయ్య, రైతులు తెలిపారు. అయితే తమకు బోనస్‌ రూపంలో సుమారు రూ.50 లక్షల మేర చెల్లించాల్సి ఉన్నా కాలయాపన చేస్తుండటంతో అక్కడకు వెళ్లామని అన్నారు. టీడీపీ నాయకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ సిబ్బంది తమపై దాడి చేయడంతో పాటు కార్లను ధ్వంసం చేశారని అన్నారు. గాయాలపాలైన సర్పంచ్‌లు, రైతులు అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులను అదే పార్టీ నాయకుడికి చెందిన కంపెనీ సిబ్బంది దాడి చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

పాడి రైతులపై సంగం డెయిరీ సిబ్బంది దాడి

గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఘటన

Advertisement

తప్పక చదవండి

Advertisement