విద్యా దీవెనకు జాయింట్‌ అకౌంట్‌ అవసరం | Sakshi
Sakshi News home page

విద్యా దీవెనకు జాయింట్‌ అకౌంట్‌ అవసరం

Published Sat, Nov 18 2023 2:06 AM

-

ఏలూరు (టూటౌన్‌): జగనన్న విద్యా దీవెన పథకం 4వ విడత లబ్ధి పొందేందుకు ఈ నెల 24 లోగా ఏదైనా జాతీయ బ్యాంకులో విద్యార్థి, తల్లితో కూడిన జాయింట్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వి.జయప్రకాష్‌ ఒక ప్రకటనలో కోరారు. ఈ విద్యాసంవత్సరం 2022–23లో ఫైనల్‌ ఇయర్‌ పూర్తయిన వారు, ఎస్సీ విద్యార్థులు మినహా మిగిలిన వారు తప్పనిసరిగా జాయింట్‌ ఖాతా ఓపెన్‌ చేయాలన్నారు. విద్యార్థి ప్రైమరీ అకౌంట్‌ హోల్డర్‌గా, తల్లి సెకండరీ హోల్డర్‌గా ఉండాలని పేర్కొన్నారు. ఒక వేళ తల్లి మరణిస్తే తండ్రి లేదా సంరక్షకుడు సెకండరీ అకౌంట్‌ హోల్డర్‌గా ఉండాలని సూచించారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అందరూ కలిసి ఒకే బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చని తెలిపారు. ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు ఉండకూడదన్నారు. జాయింట్‌ ఖాతాకు ఆధార్‌ సీడింగ్‌ అవసరం లేదని చెప్పారు.

Advertisement
Advertisement