మంత్రి కొట్టు పూజలు | Sakshi
Sakshi News home page

మంత్రి కొట్టు పూజలు

Published Sat, Nov 18 2023 6:30 AM

- - Sakshi

ఉంగుటూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబసమేతంగా గోపీనాథపట్నంలో నాగులచవితి పండుగను ఘనంగా నిర్వహించారు. తన వ్యవసాయ క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. ఆయన భార్య సౌదినికుమారి, సోదరుడు తాతాజీ, కుటుంబసభ్యులు ఉన్నారు.

21న మత్స్యకార దినోత్సవం

నరసాపురం: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఈనెల 21న నరసాపురంలో ఘనంగా నిర్వహించనున్న ట్టు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. పట్టణంలోని అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, కలెక్టర్‌ పి.ప్రశాంతి హాజరవుతారన్నారు. అలాగే అదేరోజు దేశంలోనే మూడోవదిగా నరసాపురంలో రూ.750 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాటుకానున్న ఫిషరీష్‌ యూని వర్సిటీకి సంబంధించి తరుగతులు ప్రారంభిస్తామన్నారు. ఓ వైపు యూనివర్సిటీ పనులు జరుగతుండగా, ఈ ఏడాది తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభిస్తామన్నారు. పట్టణంలో పునః నిర్మించిన చేపల మార్కెట్‌ను కూడా అదేరోజు ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మా ణం కూడా మొదలుకానుందన్నారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

వీరవాసరం: జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కారించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. జేసీ ఎస్‌.రామసుందర్‌రెడ్డితో కలిపి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో మండలస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జగనన్నకు చెబుదాంలో 72 అర్జీలు స్వీకరించారు.

ఉద్యోగుల గ్రీవెన్స్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల గ్రీవెన్స్‌ చక్కటి వేదిక అని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌లో ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సర్వీసు మేటర్స్‌, పెన్షన్‌ సమస్యలు, ఆర్థిక అంశాలు, క్రమశిక్షణ కేసులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ తదితర సమస్యలపై అర్జీలు అందించవచ్చన్నారు. మొత్తం 9 దరఖాస్తులు స్వీకరించారు.

ముందస్తు సాగుతో

నీటి ఎద్దడి నివారణ

పెనుమంట్ర: దాళ్వాలో ముందుస్తు సాగుకు వెళ్లడం ద్వారా సాగునీటి ఎద్దడిని అధిగమించవచ్చని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం మార్టేరు వరి పరిశోధనా స్థానంలో జరిగిన రైతులు, మిల్లర్లు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తల భాగస్వామ్య సదస్సులో ఆమె మాట్లాడారు. డిమాండ్‌గా ఉన్న వరి వంగడాలను మండలంలో కొన్ని క్లస్టర్‌లుగా ఏర్పడి సాగు చేయాలన్నారు. దాళ్వా సాగుకు వచ్చేనెల 15లోపు నారుమడులు వేసుకుని, నాట్ల పనులు మొదలుపెట్టాలన్నారు. ఎంటీయూ 1121 వంగడాన్ని 125 రోజుల్లో పండిస్తున్నారని, కోత కోసి తేమ అధికంగా ఉండగానే మిల్లులకు తరలించడంతో నూక అధికంగా వస్తుందన్నారు. ఆచార్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు ఎ.సుబ్బరామిరెడ్డి అధ్యక్షత వహించారు. పరిశోధనా స్థానం ఏడీఆర్‌ ఎం.భరత్‌లక్ష్మి, పాలకవర్గ సభ్యుడు చింతా ఈశ్వరరావు, వ్యవసాయ అధికారులు జెడ్‌.వెంకటేశ్వరరావు, మాధవరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పుట్ట వద్ద పూజలు చేస్తున్న మంత్రి కొట్టు
1/2

పుట్ట వద్ద పూజలు చేస్తున్న మంత్రి కొట్టు

‘జగనన్నకు చెబుదాం’లో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి
2/2

‘జగనన్నకు చెబుదాం’లో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

Advertisement
Advertisement