అర్హులకు ఇంటి స్థలం మంజూరుకు చర్యలు | Sakshi
Sakshi News home page

అర్హులకు ఇంటి స్థలం మంజూరుకు చర్యలు

Published Wed, Nov 22 2023 1:14 AM

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి  - Sakshi

భీమవరం (ప్రకాశంచౌక్‌): అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఇంటి స్థలం మంజూరయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌ జిల్లా కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ పి.ప్రశాంతి జగనన్న కాలనీలకు అవసరమైన భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అర్హత కలిగి స్థలం మంజూరు కానీ వారు ఒక్కరు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. 90 రోజుల స్కీం కింద అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, అవసరమైన భూ సేకరణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. డివిజన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఆర్డీఓలను అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని హౌసింగ్‌ పీడీని ఆదేశించారు. సిద్ధాంతం, పెనుగొండ, తణుకు ప్రాంతాలలో భూసేకరణపై ఆరా తీశారు. పెద్దలంక లేఅవుట్‌కు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూడాలని తెలిపారు. ఇప్పటికే కేటాయించిన లేఅవుట్‌లకు వెళ్లడానికి అంగీకరించనివారి వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ కె.కృష్ణవేణి, ఆర్డీవోలు కె.శ్రీనివాసులు రాజు, కె.చెన్నయ్య, హౌసింగ్‌ ఇన్‌చార్జి పీడీ డాక్టర్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement