ప్రణాళిక, నిరంతర సాధనతోనే విజయం | Sakshi
Sakshi News home page

ప్రణాళిక, నిరంతర సాధనతోనే విజయం

Published Sun, Nov 26 2023 12:26 AM

- - Sakshi

ఏలూరు రూరల్‌: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో నిర్వహించిన గ్రూప్‌–1, 2 పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పంధన వచ్చింది. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. హైదరాబాద్‌ సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలాలత గ్రూప్‌ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు అనేక విషయాలు బోధించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ గ్రూప్‌ 1, 2 పరీక్షల్లో విజయం సాధించాలటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ప్రణాళికతో పాటు కఠోర సాధన చేస్తే తప్పక విజయం వరిస్తుందన్నారు. ఒత్తిడితో పాటు గ్రూప్‌ పరీక్షలపై భయాన్ని విడనాడా లన్నారు. ముఖ్యంగా కోచింగ్‌ సెంటర్స్‌కు వెళితే నువ్వు గ్రూప్స్‌ రాయగలవా? నీ వల్ల అవుతుందా? అంటూ అనేక ప్రశ్నలతో మిమ్మల్ని భయపెట్టే వారు ఉంటారని గుర్తు చేశారు. అలాంటి వారిని లెక్క చేయకూడదని సూచించారు. పోలియో బారిన పడి నడవలేని స్థితిలో ఉన్న తాను ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు ఎదుర్కొని ముందుకు నడిచాన్నారు. 2004లో ఆలిండియా సివిల్స్‌లో 399 ర్యాంక్‌, 2016లో 167వ ర్యాంక్‌ సాధించానని చెప్పారు. చదువుతోనే మన తలరాత మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ ఫ్యాకల్టీ ప్రవీణ్‌, నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌ కొండా రవి, పశ్చిమగోదావరి జిల్లా సాక్షి కార్యాలయ మేనేజర్‌ వీవీ శివుడు, హేలాపురి బాలోత్సవం ఉపాధ్యక్షుడు వి.ఆనందనాయుడు తదితరులు పాల్గొన్నారు.

బాలాలత సూచనలివే..

● రీజినల్‌, నేషనల్‌, ఇంటర్నేషనల్‌ స్థాయిలో రివర్స్‌ ఇంజినీరింగ్‌ ద్వారా కరెంట్‌ ఎఫైర్స్‌ అంశంలో జరిగిన సంఘటనలపై లోతుగా పరిశీలించాలి. ఉదాహరణకు ఉత్తర కాశీలో టెన్నల్‌ కూలిపోవడం, ఖలిస్తాన్‌ ఉద్యమం, కెనడా–ఇండియా డిప్లమాటిక్‌ సమస్య డీప్‌ఫేక్‌, స్పేస్‌ఎక్స్‌ తదితర కరెంట్‌ ఎఫైర్స్‌పై పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సరైన ఆన్సర్‌ చేయాలంటే అనుభంధ అంశాలపై సైతం లోతైన పరిశీలన చేయాలి.

● ఆరో తరగతి నుంచి 12వ తరగతి పాఠ్య పుస్తకాలు చదివి చరిత్ర, పాలిటిక్స్‌, భక్తి, ఫిలాసఫీ, మతం, సైన్‌ ్స, పుస్తకాలు, మానవ అభివృద్ధితో పాటు రాజ్యాంగం, సోషల్‌ ఇష్యూస్‌పై అవగాహన పెంచుకోవాలి.

● సేకరించిన విషయాలను మళ్లీ అవగతం చేసుకునేందుకు ఒక నోట్‌బుక్‌లో రాసుకుని, రివిజన్‌ చేయాలి. పోటీ పరీక్షల్లో వస్తున్న ప్రశ్నలు ఏటా పెరుగుతున్నందు వల్ల అందుకు అనుగుణంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.

● రోజుకు కనీసం 8 గంటల పాటు చదువుకోవాలి. 2 నుంచి 3 గంటల పాటు మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయాలి. రివర్స్‌ ఇంజినీరింగ్‌ విధానంలో ప్రశ్నలు తయారు చేసుకుంటే మంచిది.

సీఎస్‌బీ అకాడమీ డైరెక్టర్‌ బాలాలత

సాక్షి ఆధ్వర్యంలో గ్రూప్‌ 1, 2 అవగాహన సదస్సు

పెద్ద ఎత్తున హాజరైన ఉద్యోగార్థులు

కొత్త విషయాలు తెలుసుకున్నా

గ్రూప్స్‌ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో? తెలిసింది. ప్రధానంగా కరెంట్‌ ఎఫైర్స్‌పై లోతైన అధ్యయనం ఎలా చేయాలి? ఇందుకోసం ఎలాంటి అంశాలు పరిశీలించాలి? నోట్స్‌ ఎలా సిద్ధం చేసుకోవాలో? బాలాలత స్పష్టంగా చెప్పారు. ఇది ఎంతో విలువైన సమాచారం. ఇలాంటి సదస్సుకు హాజరుకావడం వల్ల ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవచ్చు.

– ఐ.జయప్రద, తాడేపల్లిగూడెం

చాలా విలువైన సదస్సు

నేను పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాను. బాలాలత మేడం వస్తున్నారని తెలిసి వచ్చాను. ఆమె సూచనలు ఎంతో విలువైనవి. గ్రూప్స్‌లో విజయం సాధించాలంటే ఎలాంటి ప్రణాళికతో సిద్ధం కావాలో ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది. ఎంతో విలువైన సదస్సు ఏర్పాటుచే సినందుకు సాక్షి మీడియా వారికి కృతజ్ఞతలు.

– ఉప్పాల సైలాస్‌, తాడేపల్లిగూడెం

ఎన్నడూ ఇలాంటి సదస్సుకు రాలేదు

గ్రూప్స్‌ పరీక్షలపై గతంలో ఎవ్వరూ ఇలాంటి సదస్సులు పెట్టలేదు. ఇలాంటి సదస్సుల వల్ల యువతకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రూప్స్‌ పరీక్షలపై నాలో కలిగిన అనుమానాలకు ఈ సదస్సు నుంచి సమాధానం వచ్చింది. సాక్షి పేపర్‌ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.

– ఎన్‌ .జ్యోతి, రామాయగూడెం

స్ఫూర్తి నింపింది

సదస్సు వల్ల నాలో భయం పోయింది. మరింత ధైర్యం వచ్చింది. గ్రూప్స్‌కు ఎలా ప్రిపేర్‌ కావాలో? తెలిసింది. నేనే కాదు నాలాంటి వారు ఎందరో గ్రూప్స్‌లో విజయం సాధించారని తెలుసుకున్నాను. ఈ కార్యక్రమం నాకు చాలా మేలు చేసింది. మరింత కఠోర సాధన చేస్తాను. తప్పక విజయం సాదిస్తాను. థాంక్యూ సాక్షి. – వేమలు దుర్గ, ఏలూరు

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement