రేలారే.. రేలా.. | Sakshi
Sakshi News home page

రేలారే.. రేలా..

Published Thu, Nov 30 2023 12:52 AM

- - Sakshi

కామయ్యకుంట గ్రామం వ్యూ

ఐటీడీఏ శిక్షణ అందించింది

మా ఊరికి చెందిన సుమారు 25 మంది కళాకారులకు కేఆర్‌పురం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అది సంప్రదా య నృత్యాలు మరింత లయబద్ధంగా చేయడానికి ఉపయోగపడింది. దీంతో రాష్ట్రంలోనే మా గ్రామానికి మంచి పేరు వచ్చింది.

– కుర్సం సూర్యకుమారి, గిరిజన సంప్రదాయ నృత్య కళాకారిణి, కామయ్యకుంట

సంప్రదాయాన్ని కాపాడుకుంటున్నాం

అంతరించిపోతున్న మా గిరిజన సంప్రదాయ నృత్యాలను మేము నేటికీ కాపాడుకోవడం ఆనందంగా ఉంది. మారుమూ ల కుగ్రామంలో ఉన్న మేము గిరిజన సంప్రదాయ నృత్యాల వల్ల రాష్ట్ర నలు మూలల్లో అందరికీ పరిచయమయ్యాం.

– పైదా మల్లేశ్వరరావు, గిరిజన సంప్రదాయ నృత్య కళాకారుడు, కామయ్యకుంట

కళలకు జీవం పోస్తున్నారు

కొండకోనల్లో గిరిపల్లెల్లో జీవించే గిరిజనులు గ్రామాల్లో జరిగే పండుగలు, ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో గిరిజన సంప్రదాయ నృత్యాలు చేయడం ఆనవాయి తీ. ప్రస్తుత రోజుల్లో సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో మా గ్రామానికి చెందిన కళాకారులు రాష్ట్రస్థాయిలో మంచి పేరు తెస్తూ, కళలకు జీవం పోస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది.

– కొవ్వాసి వరలక్ష్మి, ఎంపీటీసీ, కామయ్యకుంట

వారు కాలు కదిపారంటే.. అందరి కళ్లూ వారివైపే ఉంటాయి. వారి డోలు వాయిద్య స్వరాలు ఆహ్లాదంలో ముంచెత్తుతాయి. రేలారే రేల అంటూ రేల పాటలతో చేసే నృత్యాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. వారి కట్టుబొట్లు.. వేషధారణ.. ప్రత్యేకంగా నిలుస్తాయి. వారే గిరిజన సంప్రదాయ నృత్య కళాకారులు. గిరిజన సంప్రదాయ నృత్యానికి ఉన్న ఆదరణను కాపాడుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా జరిగే భారీ కార్యక్రమాల్లో తమ నృత్యాలు ప్రదర్శిస్తూ.. ఆ కార్యక్రమాలకే కళాకాంతులు తెస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ గిరిజన సంప్రదాయ నృత్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా.. కొమ్ము, డోలు నృత్య కళాకారులకు పెట్టింది పేరుగా నిలుస్తోంది ఏలూరు జిల్లా మన్యంలోని కామయ్యకుంట గ్రామం.

సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్‌ : అది ముఖ్యమంత్రి హాజరయ్యే సభ అయినా.. ముఖ్య నేతల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే కార్యక్రమం అయినా.. శుభకార్యాలు అయినా.. అక్కడ ఏర్పాటు చేసే గిరిజనుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్య నాయకులకు స్వాగతం పలకడం.. వేదికపై తమ నృత్యాలతో సందడి చేయడం.. వారి ప్రత్యేకత. పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజానీకాన్ని వారి వేషధారణ, వాయిద్యాలు, కట్టుబొట్లు, నృత్యాలు.. విశేషంగా ఆకట్టుకుంటాయి. ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలోని మారుమూల కుగ్రామం కామయ్యకుంటకు చెందిన ఈ కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ గ్రామం గిరిజన సంప్రదాయ నృత్య కళాకారులకు పుట్టిల్లుగా వర్థిల్లుతోంది. ఈ గ్రామానికి చెందిన కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రదర్శనలు ఇస్తూ తమ ఊరి పేరు మార్మోగేలా చేస్తున్నారు. 1,200 మంది జనాభా నివసించే ఈ గ్రామంలో 20 మందికి పైగా కొమ్ము, డోలు నృత్య కళాకారులు ఉన్నారు. తమ పూర్వీకుల నుంచి అందిపుచ్చు కున్న కళకు ఏళ్లతరబడి వీరు జీవం పోస్తున్నారు. మడకం రాముడు అనే గిరిజన సంప్రదాయ నృత్య కళాకారుడి ఆధ్వర్యంలో వీరంతా బృందంగా ఏర్పడి ప్రదర్శనలు ఇస్తున్నారు.

ఐటీడీఏ ద్వారా శిక్షణ

కామయ్య కుంట గ్రా మంతో పాటు మరికొన్ని గ్రామాల్లో గిరిజన సంప్రదా య నృత్యాల పట్ల ఆసక్తి ఉన్న గిరిజన యువతీ యువకులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించారు. శిక్షణ పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు అన్ని గ్రామాల వారూ నృత్యాలు చేసినా.. కొంతకాలం తర్వాత కామయ్యకుంటకు చెందిన నృత్య కళాకారులే మిగిలారు. వీరు మాత్రమే గత 15 సంవత్సరాలుగా సంప్రదా య నృత్యాలను ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ, గ్రామాల్లోని శుభకార్యాల్లోనూ చేస్తూ వస్తున్నారు. వీరికి డోలు, కొమ్ములతో పాటు దుస్తులను కూడా ఐటీడీఏ సరఫరా చేసింది. రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కామయ్యకుంట నుంచి గిరిజన సంప్రదాయ నృత్య కళాకారులు హాజరవుతున్నారు. దీంతో కామయ్యకుంట గ్రామానికి కొమ్ము నృత్య కళాకారుల పుట్టిల్లుగా పేరొచ్చింది.

కొమ్ము.. డోలు.. రేల నృత్యం కామయ్యకుంటకే ప్రత్యేకం

సీఎం, మంత్రుల బహిరంగ సభల్లో ప్రత్యేక ఆకర్షణగా వీరి నృత్యాలు

గిరిజన సంప్రదాయ నృత్యాలకు జీవం పోస్తున్న కళాకారులు

రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలతో గ్రామానికి వన్నె

పలు జిల్లాల్లో నృత్య ప్రదర్శనలు చేశాం

మారుమూల కుగ్రామానికి చెందిన మేము శ్రీకాకుళం, అరకు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి అనేక ప్రాంతాల్లో మా నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం కామయ్యకుంట పేరు చెబితే కొమ్ము, డోలు నృత్య కళాకారులు గుర్తుకురావడం సంతోషంగా ఉంది.

– మడవి ప్రసాద్‌, గిరిజన సంప్రదాయ నృత్య కళాకారుడు, కామయ్యకుంట

చాలా గర్వంగా ఉంది

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల కార్యక్రమాల్లో స్వాగతం పలికేందుకు మారు మూల అటవీ ప్రాంతంలో ఉండే కొమ్ము, డోలు, రేల పాటల కళాకారులుగా మా గ్రామస్తులకు అవకాశం రావడం ఉంతో ఆనందంగా ఉంది. కామయ్యకుంట గ్రామం పేరు మరింత పెరగడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది.

– పెడకం విజయలక్ష్మి, సర్పంచ్‌, కామయ్యకుంట

 సంపద్రాయ గిరిజన నృత్యాలు చేస్తున్న కామయ్యకుంట గిరిజనులు
1/7

సంపద్రాయ గిరిజన నృత్యాలు చేస్తున్న కామయ్యకుంట గిరిజనులు

2/7

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement

తప్పక చదవండి

Advertisement