జాతీయ ఏకలవ్య పోటీలకు ముగ్గురి ఎంపిక | Sakshi
Sakshi News home page

జాతీయ ఏకలవ్య పోటీలకు ముగ్గురి ఎంపిక

Published Fri, Dec 8 2023 12:46 AM

హుండీల నగదు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది  - Sakshi

బుట్టాయగూడెం: కర్ణాటకలోని మైసూర్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఏకలవ్య నేషనల్‌ లెవెల్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు తమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు ఇప్పలపాడు ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బి.అమృత్‌ కుమార్‌ చెప్పారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌మీట్‌ అండర్‌–19 విభాగంలో తమ పాఠశాల విద్యార్థులైన కణితి కార్తిక్‌, మడకం భరత్‌, కూరం ఐశ్వర్య అత్యంత ప్రతిభ కనపరచి జాతీయ స్థాయి స్పోర్ట్స్‌మీట్‌కు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గడచిన 17 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ.1,55,92,938 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 159 గ్రాముల బంగారం, 3.650 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రదైన పాత రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.500 నోట్ల ద్వారా రూ.18,500 లభించినట్టు చెప్పారు. లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ అమృత్‌కుమార్‌
1/1

విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ అమృత్‌కుమార్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement