క్షీరారామంలో మంత్రి రోజా పూజలు | Sakshi
Sakshi News home page

క్షీరారామంలో మంత్రి రోజా పూజలు

Published Sun, Dec 10 2023 12:30 AM

- - Sakshi

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే శనివారం సందర్శించారు. ముందుగా ఆమెకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలో గణపతి పూజ చేసిన అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్దనస్వామి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను ఆమె దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. స్వామి అభిషేక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శుక్రవారం అమరావతి అమరేశ్వరస్వామిని దర్శించుకుని శనివారం దాక్షారామం, సామర్లకోట పంచారామాలను దర్శించుకుని ఇక్కడకు వచ్చానన్నారు. ఇక్కడ నుంచి భీమవరం వెళతానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఈ ఆలయానికి వచ్చానని, ఇప్పుడు మంత్రిగా స్వామిని దర్శించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి మరో 30 ఏళ్లపాటు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు. తిరుమల తిరుపతిలో అన్నదానంపై వస్తున్న కామెంట్లు తలాతోక లేకుండా సోషల్‌ మీడియాలో చేస్తున్న ఫేక్‌ న్యూస్‌లన్నారు. ఆలయంలో సామాన్యుడికి ఉచిత దర్శనం సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో బ్రేక్‌ దర్శనాలు ఉదయం 10 గంటలకు ఏర్పాటుచేస్తున్నారని చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గు డాల శ్రీహరిగోపాలరావు, దెందులూరు ని యోజకవర్గ పరిశీలకుడు యడ్ల తాతాజీ, ఆలయ చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ఈఓ యాళ్ల సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

మావుళ్లమ్మ దర్శనం నిలిపివేత

భీమవరం (ప్రకాశంచౌక్‌): 60వ వార్షిక మహోత్సవాల కోసం భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో గర్భగుడిని శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో కళాపకర్షణ జరిపి మూసివేశారు. తిరిగి ఈనెల 28న ఉదయం 11 గంటలకు కళాన్యాసం జరిపి అమ్మవారి మూలవిరాట్‌ దర్శనం పునః ప్రారంభమవుతుందని ఆలయ సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. వచ్చేనెల 13 నుంచి అమ్మవారి వార్షిక మహోత్సవా లు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తలు ముత్యాల రామారావు, రామాయణం సత్యనారాయణ, మావూరి సుందరరావు, తాళ్లపూడి భాగ్యలక్ష్మి, గోపిశెట్టి విజయలక్ష్మి పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం

ఏలూరు (టూటౌన్‌): కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రెండో జిల్లా జడ్జి పి.మంగాకుమారి కోరారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కోర్టులున్న అన్ని ప్రదేశాల్లో శనివారం జాతీయ లోక్‌ అ దాలత్‌ను నిర్వహించారు.

1,957 కేసుల పరిష్కారం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 1,957 కేసులను పరి ష్కరించారు. 139 సివిల్‌ కేసులు, 111 వాహన ప్రమాద బీమా కేసులను రాజీ చేశారు. దీని ద్వారా రూ.7 కోట్ల 37 లక్షల 35 వేలను కక్షిదారులకు పరిహారంగా చెల్లించారు.

Advertisement
Advertisement