ఘనంగా సెమీ రకిస్మస్‌ వేడుకలు | Sakshi
Sakshi News home page

ఘనంగా సెమీ రకిస్మస్‌ వేడుకలు

Published Wed, Dec 20 2023 2:04 AM

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి తదితరులు  - Sakshi

భీమవరం: ఏసుక్రీస్తు ప్రేమ, దయ ప్రజలందరి జీవితాలకు మార్గదర్శకమని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లా క్రిస్టియన్‌, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు మంగళవారం స్థానిక విష్ణు కాలేజీ మినీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత విద్యార్థుల ప్రార్థన గీతాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్లతో కలిసి కలెక్టర్‌ పి.ప్రశాంతి క్రిస్మస్‌ కేకును కట్‌ చేశారు. కలెక్టర్‌ మాటాడుతూ ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు, ప్రజల జీవన శైలిని మార్చేశాయని చెప్పారు. క్రీస్తు మార్గం అనుసరణీయమన్నారు. కుల, వర్గ భేదాలు లేకుండా క్రైస్తవులు మెలగడం సంతోషదాయకమన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలన్నారు. జిల్లా ప్రజలకు కలెక్టర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగాలకు ప్రతీకగా ఏసుక్రీస్తు నిలిచారని భీమవరం ఆర్డీఓ కె.శ్రీనివాసులు రాజు అన్నారు. ఆయన బోధనలు అనుసరణీయమన్నారు. అందరిలో శాంతి సమాధానం నెలకొల్పేందుకు ఏసుక్రీస్తు భూమిపై అవతరించారని పాస్టర్‌ రెవరెండ్‌ ప్రతాప్‌ అన్నారు. తదుపరి క్రిస్మస్‌ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్‌, ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎన్‌.కృపావరం, భీమవరం ఆర్డీఓ కె.శ్రీనివాసులు రాజు, మున్సిపల్‌ కమిషనర్‌, 15 పాయింట్స్‌ మెంబర్‌ వీఎస్‌ వరప్రసాద్‌, క్రిస్ట్రియన్‌ కార్పొరేషన్‌ మెంబర్‌ పి.అనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement