నోడల్‌ అధికారులకు అవగాహన | Sakshi
Sakshi News home page

నోడల్‌ అధికారులకు అవగాహన

Published Wed, Dec 20 2023 2:04 AM

నోడల్‌ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ప్రశాంతి, జేసీ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి  - Sakshi

భీమవరం (ప్రకాశంచౌక్‌): సార్వత్రిక ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా ఉండాలని నోడల్‌ అధికారులకు కలెక్టర్‌ పి.ప్రశాంతి దిశానిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి సంయుక్తంగా ఎన్నికల విధులకు నియమించిన 22 మంది జిల్లా నోడల్‌ అధికారులతో రానున్న ఎన్నికలలో చేపట్టాల్సిన పనులపై క్షుణ్నంగా అంశాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులలో పొరపాట్లకు తావులేని విధంగా అధికారులు అప్రమత్తతతో విధులు నిర్వహించాలని తెలిపారు. సందేహాలను, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. స్వీప్‌ యాక్టివిటీ ఎంతో కీలకమైనదని, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత నోడల్‌ అధికారి కేసీహెచ్‌ అప్పారావును ఆదేశించారు. లా అండ్‌ ఆర్డర్‌, మ్యాన్‌ పవర్‌, ఈవీఎం, ట్రాన్స్‌పోర్ట్‌, ట్రైనింగ్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర నిర్వహించాల్సిన విధులపై వివరించారు. నోడల్‌ అధికారులు బి.శ్రీమన్నారాయణ రెడ్డి, కెసిహెచ్‌ అప్పారావు, ఆర్‌.వెంకటరమణ, సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, కేసిహెచ్‌ రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, టి.నాగేశ్వరరావు, జెడ్‌.వెంకటేశ్వరరావు, టి.శివరామ ప్రసాద్‌, ఏన్‌.సరోజ, లోకేశ్వరరావు, వైసీహెచ్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement