తనిఖీల్లో పట్టుబడింది రూ.33.52 కోట్లు | Sakshi
Sakshi News home page

తనిఖీల్లో పట్టుబడింది రూ.33.52 కోట్లు

Published Thu, Nov 2 2023 4:20 AM

వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ  - Sakshi

నల్లగొండ : ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో నల్లగొండ జిల్లాలో మొత్తం రూ.33,52,11,930, ఇతర విలువైన వస్తువులను సీజ్‌ చేసినట్లు ఎన్నికల గ్రీవెన్స్‌ కమిటీ వెల్లడించింది. ఈ మొత్తంలో కేవలం రూ.6,35,14,860 రిలీజ్‌ చేసినట్లు తెలిపింది. ఇంకా రూ.27,16,97,070 విడుదల చేయాల్సి ఉంది. రూ.10 లక్షలకు పైచిలుకు నగదు, ఆభరణాలు తీసుకెళుతున్న వారికి సంబంధించిన వివరాలను పోలీసులు ఐటీ శాఖకు అప్పగించారు. ఇప్పటి వరకు 206 కేసులు బుక్‌ చేయగా.. 196 కేసులు క్లీయర్‌ అయ్యాయి. ప్రస్తుతం ఐటీ శాఖ పరిధిలో రూ.26,98, 01,950 సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా 35 కేజీల 32 గ్రాముల బంగారం, 189 కేజీల 436 గ్రాముల వెండి, 3 కేజీల 14 గ్రాముల డైమండ్‌కు సంబంధించి కేసులు ఐటీ శాఖ వద్ద ఉండగా.. అందులో రూ.17,65,950 విలువ చేసే వస్తువులకు సంబంధించి ఆదారాలు చూపడంతో ఐటీ శాఖ రిలీజ్‌ చేసింది. ఇంకా రూ.26,80,36,000 విలువ చేసే ఆభరణాలు రిలీజ్‌ కావాల్సి ఉంది.

చండూరు ఆర్‌ఓ

కార్యాలయం సందర్శన

చండూరు: ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎస్పీ అపూర్వరావు బుధవారం చండూరులో మునుగోడు నియోజకవర్గ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కార్యాలయాన్ని సందర్శించారు. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నందున ఏర్పాట్లను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని పోలీసులు సీఐ, ఎస్‌ఐలకు సూచించారు. ఆమె వెంట ఆర్‌ఓ దామోదర్‌రావు, ఎస్‌ఐ రవీందర్‌ రెడ్డి, ఎలక్షన్‌ డీటీ దీపక్‌, స్థానిక అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement