ఎమ్మార్పీఎస్‌–టీఎస్‌ మద్దతు బీఆర్‌ఎస్‌కే | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌–టీఎస్‌ మద్దతు బీఆర్‌ఎస్‌కే

Published Tue, Nov 14 2023 1:50 AM

మాట్లాడుతున్న వంగపల్లి శ్రీనివాస్‌, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌
 - Sakshi

ఆలేరురూరల్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎమ్మార్పీఎస్‌–టీఎస్‌ మద్దతు ఇస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ప్రకటించారు. సోమవారం ఆలేరులోని కేజేఎన్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఒక్క కేసీఆర్‌ వల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాదిగలను మోసం చేసిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. ఓట్ల కోసమే మాదిగలను వాడుకుందని విమర్శించారు. మరోసారి మాదిగల ఓట్లను దండుకునే యత్నం చేస్తుందని దుయ్యబట్టారు. ఆలేరు గడ్డపై మూడవసారి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేస్తామన్నారు. కేసీఆర్‌ ఆలేరును రెవెన్యూ డివిజన్‌ చేస్తారని, గంధమల్ల చెరువును మల్లన్నసాగర్‌తో నింపి ఆలేరు, రాజాపేట మండలాల సస్యశ్యామలం చేస్తారని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని రేటంత్‌రెడ్డిగా మారాడని విమర్శించారు. టికెట్‌లు అమ్ముకున్న వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెడతాడని ఆరోపించారు. భిక్షమయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రేషన్‌కార్డు ఉన్న ప్రతి పేదవాడికి సన్న బియ్యంతో పాటు రూ.5లక్షల బీమా అందజేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మదర్‌డెయిరీ చైర్మన్‌ లింగాల శ్రీకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఆలేరు పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, మున్సిపల్‌ చైర్మన్‌ శంకరయ్య, పీఎసీఎస్‌ చైర్మన్‌ మల్లేషం, గంగుల శ్రీనివాస్‌, అడెపు బాలస్వామి, పోరెడ్డి శ్రీనివాస్‌, జంపాల దశరథ, ఫిలిప్‌, కుండె సంపత్‌, దయ్యాల సంపత్‌, కొల్లూరి వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

Advertisement
Advertisement