తొమ్మిదేళ్లకే కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లకే కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌

Published Tue, Feb 27 2024 2:10 AM

ప్రశంసా పత్రంతో భోగ మాన్విక
 - Sakshi

భూదాన్‌పోచంపల్లి : పట్టణానికి చెందిన భోగ కిరణ్‌కుమార్‌ కుమార్తె భోగ మాన్విక తొమ్మిదేళ్ల పిన్న వయస్సులో కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది. యొద్ద గోజు ర్యూ స్పోర్ట్స్‌ కరాటే ఆర్గనైజేషన్‌ ఇండియా అనే సంస్థలో కరాటేలో శిక్షణ పొందిన మాన్విక.. అనతికాలంలో తన ప్రతిభతో బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనస్థలిపురం సీఐ సత్యనారాయణ, మాస్టర్లు రాజేశ్వర్‌, రఘుకుమార్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, బ్లాక్‌బెల్ట్‌ అందుకుంది. మాన్విక ఇటీవల గోవా, వైజాగ్‌, హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించింది.

Advertisement
Advertisement