మాజీ సైనికుల స్థలాల ఆక్రమణను అడ్డుకోండి | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుల స్థలాల ఆక్రమణను అడ్డుకోండి

Published Wed, May 31 2023 3:42 AM

రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇస్తున్న 
మాజీ సైనికులు - Sakshi

పోరుమామిళ్ల : దేశ రక్షణ కోసం పాటుపడిన తమకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను కాపాడాలని మాజీ సైనికులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం 2012లో రంగసముద్రం రెవెన్యూ భూమి సర్వే నంబర్‌ 1263లో 315 మంది మాజీ సైనికులకు 3 సెంట్ల ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. చాలా ప్లాట్లు ఇంకా ఖాళీగా ఉండడంతో సీపీఎం నేత వాటిని ఆక్రమించి అమ్ముకోవడం మొదలు పెట్టాడన్నారు. ఒక్కో ప్లాటు రూ.1,70,000 ప్రకారం అమ్ముకున్నాడని, ఇక్కడే కాకుండా ఎక్కడ ఖాళీ ప్లాటు ఉంటే దాన్ని కబ్జా చేసి అమ్ముకుంటున్నాడన్నారు. అడిగినా, అడ్డుకున్నా సీపీఎం కార్యకర్తలను ఎగదోసి అతనికి అడ్డు లేకుండా చేసుకుంటున్నాడన్నారు. కావున ఆక్రమణలను అధికారులు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement