డేంజర్‌లో మైనర్‌ | Sakshi
Sakshi News home page

డేంజర్‌లో మైనర్‌

Published Fri, Sep 22 2023 2:02 AM

స్కూటర్‌పై వెళుతున్న మైనర్‌ విద్యార్థులు - Sakshi

అతివేగం.. తీసింది ప్రాణం

పాఠశాలకు చేరాలనే ఆతృతతో అతివేగంగా నడుపుతూ జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు ఇద్దరు మైనర్లు. మండలంలోని బోడిగుట్ట, మెరంపల్లెకు చెందిన హర్షవర్ధనాచారి(07), నరేంద్రాచారి(15) పాఠశాలకు ద్విచక్రవాహనంలో బయలుదేరారు. గుర్రంకొండ సమీపంలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించిబోయి అవగాహనా రాహిత్యంతో ఢీకొని ప్రాణాల మీదకు తెచ్చుకొన్నారు.

రోడ్డుపై బైక్‌లతో మైనర్లు దూసుకెళ్తున్నారు. ఒకరికి మించి మరొకరు పోటీ పడుతూ వేగం పెంచి రయ్‌ రయ్‌మంటూ నడివీధిలో హల్‌చల్‌ చేస్తున్నారు. నిండా పదేళ్లు కూడా లేని పిల్లలు ద్విచక్ర వాహనం నడుపుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఒకే స్కూటర్‌పై షికారు కొడుతూ విన్యాసాలు చేస్తున్నారు. గుర్రంకొండలో ఈ దృశ్యాలు నిత్యం కనిపిస్తుంటాయి.

గుర్రంకొండ : ద్విచక్ర వాహనాలను నడుపుతూ మైనర్లు తమ ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. గుర్రంకొండ పట్టణ పరిధిలోని కడప–బెంగుళూరు జాతీయ రహదారిపై పెద్ద పెద్ద శబ్ధాలు చేసే సైలెన్సర్లు పెట్టుకుని దూసుకెళ్తున్నారు. ఏమాత్రం రహదారి నిబంధనలు తెలియని వీరు.. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడం ఇందుకు అద్దంపడుతోంది.

మైనర్ల హల్‌చల్‌

ద్విచక్రవా హనాలపై మైనర్లు దర్జాగా పాఠశాలలకు వెళ్తున్నారు. ఇవి పట్టణంలో నిత్యం కనిపించే దృశ్యాలే. పాఠశాల వదిలే సమయంలో తనతోటి ముగ్గురు, నలుగురిని ఎక్కించుకుని వేగంగా నడుపుతూ వెళ్లడంతో ఇతర విద్యార్థులు భయపడుతున్నారు. నిత్యం పాఠశాలకు వెళ్లేటపుడు, వచ్చే సమయంలోనూ మైనర్ల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పదేళ్ల నుంచి పన్నెండేళ్ల వయస్సన్న వారు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారు. ఇంత వేగంగా నడిపినపుడు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్న పిల్లలకు ద్విచక్ర వాహనాలిచ్చి రోడ్లపైకి పంపడంతో నడపడం చేతగాక ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

సైలెన్సర్‌ తీసి.. నడుపుతూ

కొంతమంది ఆకతాయి మైనర్లు సైలెన్సర్లు తీసేసి పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలు నడుపుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నా రు. స్కూటర్‌ ముందు భాగం పైకి లేపి విన్యాసాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం బెడిసి కొట్టి గుర్రంకొండ పట్టణంలో పది ప్రమాదాలు జరిగాయి. పలువురు మైనర్లు ఆస్పత్రులపాలయ్యారు. చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం

మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం. పట్టణంలో నాకాబందీ నిర్వహించి మైనర్ల ద్విచక్ర వాహనాలకు జరిమానా విధిస్తున్నాం. పలుచోట్ల రోడ్‌ స్టాపర్లను ఏర్పాటు చేశాం. విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించాం. పాఠశాల వేళల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పెద్ద శబ్ధాలతో నడిపే వాహనాలను సీజ్‌ చేసి సైలెన్సర్లను ధ్వంసం చేయిస్తున్నాం. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు.

– దిలీప్‌కుమార్‌, ఎస్‌ఐ, గుర్రంకొండ

పాఠశాలలకు

ద్విచక్ర వాహనాలపై మైనర్లు

సైలెన్సర్లు తీసేసి శబ్ధం చేస్తూ

విన్యాసాలు

వేగంగా నడపుతూ..

ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ

మైనర్లకు వాహనాలు ఇవ్వద్దంటున్న పోలీసులు

గుర్రంకొండ బస్టాండులో స్కూటర్‌పై  
నలుగురు చిన్నారులు
1/4

గుర్రంకొండ బస్టాండులో స్కూటర్‌పై నలుగురు చిన్నారులు

హర్షవర్ధనాచారి
2/4

హర్షవర్ధనాచారి

3/4

నరేంద్రాచారి
4/4

నరేంద్రాచారి

Advertisement
Advertisement