పోలీసుల అదుపులో నిందితులు | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నిందితులు

Published Wed, Nov 15 2023 1:44 AM

వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఎన్‌.వి నాగరాజు   - Sakshi

కడప అర్బన్‌ : కడప నగరంలోని ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 12న ఉదయం ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయం సముదాయంలోని ఇనిస్టిట్యూట్‌ కార్యాలయంలో ఓగదిలో వలంటీర్‌, ఎల్‌ఐసీ డిజిటలైజేషన్‌ ఉద్యోగి చిట్వేలి భవానీశంకర్‌ను.. అతని స్నేహితుడు, టీం లీడర్‌ గుజ్జలి మల్లికార్జున, ఆటోడ్రైవర్‌ రంజిత్‌కుమార్‌తో కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కడప నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ క్రమంలో నిందితులను ఈనెల 13న అరెస్ట్‌ చేసినట్లు సీఐ ఎన్‌.వి నాగరాజు తెలియజేశారు. నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిందితుల వివరాలను సీఐ వెల్లడించారు. ఈ హత్య సంఘటన కేవలం మల్లికార్జున భార్య శైలజతో.. భవానీశంకర్‌ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనీ తెలుసుకుని.. తనతోపాటు వున్న రంజిత్‌ కుమార్‌తో కలిసి తాను పని చేస్తున్న ఆఫీసుకు ఫోన్‌ చేసి భవానీశంకర్‌ను పిలిపించారు. అతను గదిలోకి రాగానే తలుపునకు గడియపెట్టి దారుణంగా కత్తికొడవలితో పొడిచాడు. హతుని శరీరంపై దాదాపు 10 కత్తికొడవలి పోట్లు వున్నాయని ప్రాథమిక విచారణలో తెలిసింది. నిందితులను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్ట్‌ చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, రంగస్వామి, సిద్దయ్య, సిబ్బందిని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్‌ అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement