గ్రామ పాలనపై అవగాహన పెంచుకోవాలి | Sakshi
Sakshi News home page

గ్రామ పాలనపై అవగాహన పెంచుకోవాలి

Published Sun, Nov 19 2023 1:46 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతపద్మనాభరావు - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌ : గ్రామ పంచాయతీల్లో నిర్వహించాల్సిన పాలనపై అధికారులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ రాష్ట్ర సలహాదారు నాగార్జునరెడ్డి అన్నారు. శనివారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్‌ అండ్‌ ఆర్‌డీలకు నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. విధుల నిర్వహణపై అవగాహన ఏర్పరుచుకుంటే గ్రామ పరిపాలన సవ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, డీఎల్‌డీఓ వెంకట సుబ్బయ్య, జమ్మలమడుగు డీఎల్‌పీఓ విజయభాస్కర్‌, బద్వేలు డీఎల్‌పీఓ రమణారెడ్డి, కడప డీఎల్‌పీఓ మస్తాన్‌వలీ, పులివెందుల డీఎల్‌పీఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

స్కూటర్‌ను ఢీకొన్న బైక్‌

కడప అర్బన్‌ : కడప వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజారెడ్డి వీధిలో శనివారం మధ్యాహ్నం స్కూటీలో వెళుతున్న ఇరువురిని ఓ బైకర్‌ ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ‘సాక్షి’ దినపత్రికలో సీనియర్‌ సబ్‌–ఎడిటర్‌గా పనిచేస్తున్న అనంతపద్మనాభరావు, సునీల్‌లు వ్యక్తిగత పనుల నిమిత్తం స్కూటీలో నగరానికి వెళ్లారు. రాజారెడ్డి వీధిలోకి వెళుతుండగా వేగంగా వచ్చిన మోటార్‌సైకిల్‌ స్కూటీని కొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో అనంతపద్మనాభరావు తీవ్రంగా, సునీల్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో అనంత పద్మనాభరావు కాలుకు శస్త్రచికిత్స చేశారు.

మాట్లాడుతున్న పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ సలహాదారు నాగార్జునరెడ్డి
1/1

మాట్లాడుతున్న పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ సలహాదారు నాగార్జునరెడ్డి

Advertisement
Advertisement