20 నుంచి టీటీడీ కార్తీక మాసోత్సవాలు | Sakshi
Sakshi News home page

20 నుంచి టీటీడీ కార్తీక మాసోత్సవాలు

Published Sun, Nov 19 2023 1:46 AM

-

కడప కల్చరల్‌ : తిరుమల–తిరుపతి దేవస్థానాలు అనుబంధ సంస్థ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రోగామ్‌ అసిస్టెంట్‌ గోపిబాబు తెలిపారు. శనివారం సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు తెలిపారు. ఏటా కార్తీకమాసంలో మన గుడి పేరిట నిర్వహించే ఈ ఉత్సవాలను వైఎస్సార్‌ జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలో కూడా ఈ నెల 27వ తేది వరకు నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్సార్‌ జిల్లాలో శ్రీ ఉమామహేశ్వర ఆలయం, బయనపల్లె, నాగిరెడ్డిపల్లె, సీకే దిన్నె మండలాల ఆలయాలలోనూ, అన్నమయ్య జిల్లాకు సంబంధించి శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వరాలయం, మన్నూరు, రాజంపేటలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వారం రోజులపాటు హరికథలు, ధార్మిక ప్రవచనాలు, భజనలు, కార్తీక పౌర్ణమిరోజున జ్వాలాతోరణం, దీపోత్సవం, తులసిమొక్కల పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు. హాజరైన భక్తులందరికీ టీటీడీ దేవస్థానం ప్రమిదలు, దీపాలు, ఒత్తులు, నూనె, ఇతర పూజా ద్రవ్వాలను ఉచితంగా అందజేస్తారని, కార్యక్రమానంతరం అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేస్తారన్నారు. 24న మంగళ కై శిక ద్వాదశి వ్రతం సందర్భంగా ప్రతిజిల్లా నుంచి రెండు ఎంపిక చేసిన దేవాలయాలలో విశేష పూజోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు సీహెచ్‌ విజయ్‌భట్టర్‌, దర్మ ప్రచార మండలి సభ్యులు బెస్తవేముల రామమహేష్‌, ఏటూరి రామచంద్రారెడ్డి, ఎన్‌.చెన్నకృష్ణారెడ్డి, సీహెచ్‌ శివారెడ్డి, వై.దామోదరమ్మ, పలు దేవాలయాల ధర్మకర్తలు, శ్రీవారి సేవకులు, భజన బృందాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement