ఇంటి వద్దకే కులధ్రువీకరణ పత్రం | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే కులధ్రువీకరణ పత్రం

Published Sun, Nov 26 2023 12:36 AM

- - Sakshi

నాకు ఇద్దరు కుమారులు. గతంలో వారి కి కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే వీ ఆర్‌ఓలు, ఆర్‌ఐలు, ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వ చ్చేది. వైఎస్సార్‌ చేయూత పథకానికి దరఖాస్తు చేయాలంటే నాకు కుల ధ్రువీకరణ పత్రం కావాలన్నారు. ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో దరఖాస్తు చేశాను. ఒక్కరోజులోనే సర్టిఫికెట్‌ ఇంటికే తెచ్చి ఇచ్చారు. – పి. సుబ్బలక్షుమ్మ,

విలాసం బావి వీధి. రవీంద్రనగర్‌.

ఫేస్‌యాప్‌ శుభపరిణామం

ఉపాధ్యాయులు సరైన సమయానికి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫేస్‌యాప్‌ ప్రవేశపెట్టారు. అలాగే నాడు–నేడు వల్ల పాఠశాలలు సమగ్రాభివృద్ధి చెందాయి. ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా పాఠశాలకు వెళ్లి విద్యాబోధన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు చాలా అస్తవ్యస్తంగా ఉండేవి. పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

– కాశీప్రసాదరెడ్డి, హెడ్మాస్టర్‌, వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌, ప్రొద్దుటూరు

వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటా

నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వారికి పెళ్లిల్లు అయిపోయాయి. నేను కుండలు తయారు చేసుకుని జీవనం సాగిస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకంలో భాగంగా తొండూరులో స్థలంతోపాటు సొంతింటి కల నెరవేర్చుకున్నాను. నా చిన్న కుమారుడికి కూడా జగనన్న స్థలం, ఇల్లు మంజూరయ్యాయి. జగన్‌సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. – చిలంకూరు వెంకటన్న,

లబ్ధిదారుడు, తొండూరు మండలం

1/3

2/3

3/3

Advertisement
Advertisement