తుపానుపై అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

Published Sun, Dec 3 2023 1:40 AM

- - Sakshi

కలెక్టర్‌ విజయరామరాజు
తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రద్దు

కడప సెవెన్‌రోడ్స్‌: ‘మిచాంగ్‌’ తుపాను జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నందున.. ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయరామరాజు సూచించారు. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. నదులు, వంకల పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండవచ్చన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ఇసుక సంచులు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యం, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్‌ రూము నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కలెక్టరేట్‌తోపాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓ కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

జిల్లాలోని కంట్రోల్‌ రూములు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కడప–విశాఖపట్టణం–కడపల మధ్య నడు స్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 4 నుంచి 6 వరకు రద్దు చేశారని కడప రైల్వే చీఫ్‌ టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉమర్‌బాషా, సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. తుపాను ప్రభావంతో రద్దు చేశారని వారు పేర్కొన్నారు.

కలెక్టరేట్‌ : 08562–246344

ఆర్డీఓ ఆఫీసు, కడప: 08562–295990

ఆర్డీఓ ఆఫీసు, జమ్మలమడుగు: 9502836762

ఆర్డీఓ ఆఫీసు, బద్వేలు: 76708 82856

ఆర్డీఓ ఆఫీసు, పులివెందుల: 62810 04720

Advertisement
Advertisement