●సైనికుల సేవలు వెలకట్టలేనివి | Sakshi
Sakshi News home page

●సైనికుల సేవలు వెలకట్టలేనివి

Published Fri, Dec 8 2023 1:16 AM

తొలి విరాళం అందజేస్తున్న 
జిల్లా కలెక్టర్‌ వి. విజయరామరాజు  - Sakshi

వైవీయూ : దేశరక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయని సాయుధ దళాల సైనికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు అన్నారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సాయుధ దళాల నిధికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కలెక్టర్‌ మొదటి విరాళం అందజేసి.. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విరాళాలు ఇవ్వడం ఒక సేవగా భావించి ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తోందన్నారు. జిల్లా ప్రజలు సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించాలని కోరారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌, ఇతర అధికారులు తమవంతుగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి ఐజే రఘురామయ్య, సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు కె.వి.రావు, 30 ఆంధ్రా బెటాలియన్‌ ఎన్‌సీసీ అధికారులు సమయ్‌సింగ్‌, నాగరాజు, ఎన్‌సీసీ కేడెట్స్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement