ఎస్సీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | Sakshi
Sakshi News home page

ఎస్సీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Published Thu, Dec 14 2023 12:22 AM

జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం లబ్ధిదారులతో పులి సునీల్‌కుమార్‌ తదితరులు     - Sakshi

కడప రూరల్‌ : ‘ఎస్సీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా భూమి కొనుగోలు పథకం కింద మార్టిగేజ్‌ను తొలగించి, లబ్ధిదారులకు భూములపై సర్వ హక్కులను కల్పించడం చరిత్రాత్మక నిర్ణయం’.. అని సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు రాష్ట్ర చైర్మన్‌ పులి సునీల్‌కుమార్‌ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆ శాఖ కార్యాలయంలోని ఛాంబర్‌లో భూమి కొనుగోలు పథకం కింద భూములను పొందిన వారికి మార్టిగేజ్‌ను తొలగించి, పొందిన భూములపై సర్వ హక్కులను కల్పిస్తూ లబ్ధిదారులు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గతంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుపేదలైన ఎస్సీలు భూమి కొనుగోలు పథకం కింద భూములను పొందారన్నారు. ఆ భూములు ఎస్సీ కార్పొరేషన్‌లో తనఖా (మార్టిగేజ్‌)లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేసి మార్టిగేజ్‌ను తొలగించి, ఆ భూములపై సర్వ హక్కులను కల్పించారన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఈ పథకం కింద 1992 నుంచి 2014వ సంవత్సరం వరకు 1,738 మంది ఎస్సీ మహిళలు భూములను పొందారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ త్యాగరాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement