జాతీయ స్థాయి పోటీలకు భారతి డీఏవీ స్కూల్‌ విద్యార్థుల ఎంపిక | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు భారతి డీఏవీ స్కూల్‌ విద్యార్థుల ఎంపిక

Published Thu, Dec 14 2023 12:22 AM

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న 
భారతి డీఏవీ స్కూల్‌ విద్యార్థులు  - Sakshi

కమలాపురం : కమలాపురం మండలం నల్లింగాయపల్లెలో ఉన్న భారతి డీఏవీ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సఫిల్‌ గూడా డీఏవీ స్కూల్‌లో ఇటీవల జరిగిన స్టేట్‌ లెవెల్‌ డీఏవీ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ పోటీల్లో ఇక్కడివిద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌ –17 బాలుర విభాగంలో పదవ తరగతి చదువుతున్న బి. విష్ణువర్దన్‌రెడ్డి 800 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. పదవ తరగతి చదువుతున్న కె.జితేంద్రరెడ్డి డిస్కస్‌ త్రోలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. అండర్‌ – 17 బాలికల విభాగంలో ఎం.రెడ్డి లక్ష్మి లాంగ్‌ జంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరు త్వరలో జరిగే డీఏవీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.కిషోర్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు భారతి సిమెంట్‌ కర్మాగారం సీఎంఓ సాయి రమేష్‌, హెచ్‌ఆర్‌ గోపాల్‌ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అఽధికారి శేషాద్రి బుధవారం విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయుడు చందును అభినందించారు.

Advertisement
Advertisement