‘ఆడుదాం ఆంధ్ర’ ట్రయల్‌ మ్యాచ్‌లు విజయవంతం | Sakshi
Sakshi News home page

‘ఆడుదాం ఆంధ్ర’ ట్రయల్‌ మ్యాచ్‌లు విజయవంతం

Published Fri, Dec 15 2023 1:24 AM

‘ఆడుదాం ఆంధ్ర’ సన్నాహక మ్యాచ్‌లో పాల్గొన్న అధికారులు, క్రీడాకారులు 
 - Sakshi

– ప్రారంభించిన డీఎస్‌డీఓ కె. జగన్నాథరెడ్డి

కడప స్పోర్ట్స్‌: క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా క్రీడాటోర్నమెంట్‌కు సంబంధించిన సన్నాహక మ్యాచ్‌లు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. గురువారం కడప నగరంలోని జిల్లా క్రీడాప్రాథికార సంస్థ మైదానంలో నిర్వహించిన ట్రయల్‌ మ్యాచ్‌లను డీఎస్‌డీఓ కె. జగన్నాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తోందన్నారు. డిసెంబర్‌ 15న ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు.. మరోవారం పాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్‌ అంబాసిడర్‌, టెన్నిస్‌ మెడలిస్టు అబిగేల్‌, స్థానిక కార్పొరేటర్‌ కె. సూర్యనారాయణరావు, నగరపాలక అధికారులు విజయభాస్కర్‌గౌడ్‌, శ్రీనివాసులు, హరిప్రసాద్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం. ప్రవీణ్‌కిరణ్‌, సాజిద్‌, నిత్యప్రభాకర్‌, శ్రీనివాసులరెడ్డి, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, కోచ్‌లు అమృత్‌రాజ్‌, అబ్దుల్‌ మునాఫ్‌, శ్రీనివాసరాజు, కల్యాణ్‌, శ్రీధర్‌, సుదర్శన్‌సిద్ధిక్‌, విలియం కేరీ, శ్యామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.

రైలు నుంచి జారిపడి మహిళకు తీవ్ర గాయాలు

పీలేరురూరల్‌ : రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలోని పింఛా నది బ్రిడ్జికి అవతల రైల్వే ట్రాక్‌ పక్కన మహిళ పడి ఉండగా గమనించిన రైల్వే క్యూమెన్‌ సుబ్రమణ్యం హుటాహుటిన ఆమెను 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఎవరైంది ఎలాంటి ఆధారాలు లేవు.

అక్రమంగా మద్యం రవాణా కేసులో ఇద్దరికి జైలు

రాయచోటిటౌన్‌ : కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న ఘటనలో ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా విఽధిస్తూ రాయచోటి కోర్టు ఏజేఎఫ్‌సీఎం డాక్టర్‌ శారద తీర్పు చెప్పారు. ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ ధీరజ్‌ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2021 సంవత్సరం నవంబర్‌ 17న రాయచోటి – చిత్తూరు రింగ్‌ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా బంగారుపేటకు చెందిన బత్తల శశిధర్‌, చిన్నమండెం మండలం వండాడి తూర్పుపల్లెకు చెందిన యండపల్లె సాయి ప్రతాప్‌రెడ్డిలు ఆటోలో కర్ణాటక మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారు రాయచోటి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. ఈ కేసు ప్రభుత్వం తరపున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.సుజాత వాదించారు.

Advertisement
Advertisement