చరిత్రలో నిలిచిపోయిన రారాజు శ్రీకృష్ణదేవరాయలు | Sakshi
Sakshi News home page

చరిత్రలో నిలిచిపోయిన రారాజు శ్రీకృష్ణదేవరాయలు

Published Sun, Dec 17 2023 11:56 PM

- - Sakshi

మదనపల్లె: బలిజల ఆరాధ్యదైవమైన శ్రీ కృష్ణదేవరాయలు మంచి పరిపాలనా దక్షుడిగా, నీతికి, నిజాయితీకి మారుపేరుగా, సమైక్యతా భావాలను పెంపొందించిన మహనీయుడిగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి చర్రితలో నిలిచిపోయిన రారాజు అని గనులు, విద్యుత్‌, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. బలిజ జేఏసీ మదనపల్లె అధ్యక్షుడు వైఎస్‌.మునిరత్నం ఆధ్వర్యంలో మండలంలోని బసినికొండ పంచాయతీ పుంగనూరు బైపాస్‌రోడ్డు వై జంక్షన్‌లో ఏర్పాటుచేసిన శ్రీ కృష్ణదేవరాయల కాంస్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, పెద్దిరెడ్డిద్వారకనాథరెడ్డి, ఆరణిశ్రీనివాసులు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపాశేషు, టీటీడీ బోర్డు మాజీ మెంబర్‌ పోకలఅశోక్‌కుమార్‌, కర్ణాటక కై వారం శ్రీక్షేత్ర ధర్మాధికారి ఎం.ఆర్‌.జయరామయ్య తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...అన్నమయ్య జిల్లా మదనపల్లె బైపాస్‌రోడ్డు జంక్షన్‌లో అందరూ చూసేలా ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. కొద్దినెలల ముందే పట్టణంలోని మల్లికార్జున సర్కిల్‌లో ఓ విగ్రహాన్ని ఏర్పాటుచేశామని, ఇప్పుడు రెండోది ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. రాయల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, చంద్రగిరికోట, తిరుపతి రాయలచెరువు ఆయన హయాంలో నిర్మితమై నేడు రైతులకు పూర్తిస్థాయిలో సేవలందిస్తోందని అన్నారు.బలిజల ఆరాధ్యదైవం శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను తమ మనోభావాలకు తగ్గట్లుగా ఏర్పాటుచేసుకుంటామని కోరితే ఉచితంగా అందజేస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ..బలిజల 30 ఏళ్ల కలను సాకారం చేస్తూ పట్టణనడిబొడ్డున, బైపాస్‌రోడ్డు జంక్షన్‌లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సహకారం అందించారన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ..బలిజల కలను నెరవేర్చిన ప్రభుత్వానికి బలిజలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ... బలిజలకు అండగా నిలుస్తామన్నారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపాశేషు మాట్లాడుతూ..రాష్ట్రంలో మరే ఇతర కులాలకు లేని విధంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కాపునేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పటివరకు రూ.2వేల కోట్లు ఇచ్చిందన్నారు. కాపు,బలిజ,తెలగ, ఒంటరి కులాలకు సీఎం జగన్‌ నేతృత్వంలో డీబీటీ పద్దతిలో 40వేల కోట్లు వరకు నిధులు జమకావడం జరిగిందన్నారు. టీటీడీ బోర్డు మాజీ మెంబర్‌ పోకలఅశోక్‌కుమార్‌ మాట్లాడారు. అంతకుముందు బలిజయువత ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సభ అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహదాతలు కత్తికృష్ణమూర్తి, కత్తి రాజకిషోర్‌చంద్రదేవ్‌, సవరాలకృష్ణమూర్తి, లక్ష్మీదేవమ్మలను సన్మానించారు. విగ్రహావిష్కరణకు కర్ణాటక, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్యజిల్లాలతో పాటు రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని నియోజకవర్గాల నుంచి బలిజకులస్థులు హాజరయ్యారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Advertisement
Advertisement