ప్రవాసాంధ్ర భరోసా బీమాను సద్వినియోగం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రవాసాంధ్ర భరోసా బీమాను సద్వినియోగం చేసుకోవాలి

Published Sun, Dec 17 2023 11:56 PM

మేడపాటి వెంకట్‌  - Sakshi

కడప కార్పొరేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) ఆధ్వర్యంలో ప్రవాసాంధ్ర భరోసా బీమాను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్‌, డైరెక్టర్‌ బీహెచ్‌ ఇలియాస్‌ తెలిపారు. ఆదివారం వారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రవాసాంధ్ర కుటుంబాలకు ఈ బీమా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2024 జనవరి 15 నుంచి కొత్త పాలసీ వస్తుందని, ప్రీమియం డబ్బులు కూడా పెరిగే అవకాశశం ఉంటుందన్నారు. కావున ఇప్పుడున్న మేరకు వలస కార్మికులకు మూడేళ్ల కాలపరిమితితో రూ.550లు నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులతై 2024 జనవరి 15 నుంచి రూ.180లు చెల్లించి బీమా చేసుకోవచ్చన్నారు. ఈ బీమా చేసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.10లక్షల పరిహారం వస్తుందని, ప్రమాదం జరిగి ఆపరేషన్‌ ఇతర ఖర్చులకు బిల్లులు ఇస్తే లక్ష రూపాలయ వరకు పరిహారం వస్తుందన్నారు. అలాగే మహిళలకు 9 మాసాల తర్వాత గర్భం వచ్చి సాదారణ కాన్పు అయితే రూ.35వేలు, సిజేరియన్‌ అయితే రూ.50వేలు ఇస్తారన్నారు. విదేశాలలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి మనపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడకుండా గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బీహెచ్‌ ఇలియాస్‌
1/1

బీహెచ్‌ ఇలియాస్‌

Advertisement
Advertisement